amp pages | Sakshi

స్టార్‌ హోటళ్లకు 500 ఎకరాలు

Published on Thu, 07/27/2017 - 02:09

అమరావతిపై సమీక్షలో సీఎం
 
సాక్షి, అమరావతి: రాష్ట్ర రాజధాని అమరావతిలో స్టార్‌ హోటళ్ల నిర్మాణానికి వీలుగా 500 ఎకరాల్ని సిద్ధంగా ఉంచాలని సీఎం చంద్రబాబునాయుడు సీఆర్‌డీఏ అధికారుల్ని ఆదేశించారు. వివిధ ప్రాంతాల్లో వాటిని నిర్మించేందుకు వీలుగా భూములను అందుబాటులో ఉంచాలని స్పష్టం చేశారు. రాజధాని వ్యవహారాలపై బుధవారం వెలగపూడి సచివాలయంలో సీఆర్‌డీఏ అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఇస్తాంబుల్‌ తరహాలో రాజధాని అమరావతిలో ఆతిథ్యరంగాన్ని అభివృద్ధి చేయాలని సీఎం సూచించగా.. రాడిసన్, తాజ్, జీఆర్‌టీ, పార్క్, నోవాటెల్‌ వంటి ఎనిమిది ప్రముఖ సంస్థలు అమరావతిలో స్టార్‌ హోటళ్లను నిర్మించేందుకు ముందుకొచ్చాయని సీఆర్‌డీఏ అధికారులు ఆయనకు వివరించారు. 
 
హైపర్‌లూప్‌ రవాణాపై అధ్యయనం 
అమరావతిలో మెట్రోరైలు స్థానంలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, అత్యంత వేగంతో కూడిన రవాణా వ్యవస్థను ఏర్పాటు చేసే ‘హైపర్‌లూప్‌ రవాణా వ్యవస్థ’పై అధ్యయనం జరపాలని సీఎం ఆదేశించారు.  హైపర్‌లూప్‌ వ్యవస్థ ఏర్పాటైతే విశాఖ నుంచి అమరావతికి 23 నిమిషాల్లో, అమరావతి నుంచి తిరుపతికి 25 నిమిషాల్లో చేరుకోవచ్చన్నారు. 
 
ప్రీ స్కూళ్లుగా అంగన్‌వాడీ కేంద్రాలు
రాష్ట్రంలోని అంగన్‌వాడీ కేంద్రాల్ని ప్రీ స్కూళ్లుగా మారుస్తున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు. ఈ స్కూళ్లలో తెలుగుభాషకు ప్రాధాన్యం తగ్గించకుండానే ఆంగ్లంలో బోధిస్తారని చెప్పారు. బుధవారం విజయవాడ క్యాంపు కార్యాలయం నుంచి ‘అంగన్‌వాడీ కేంద్రాలు–ప్రీ ప్రైమరీ స్కూళ్లు’ అంశంపై తల్లిదండ్రులు, అంగన్‌వాడీ ఉపాధ్యాయులతో సీఎం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. పట్టణ ప్రాంతాల్లోని 3,128 అంగన్‌వాడీ కేంద్రాల్ని ఏకీకృతం చేసి 1,026 ప్రీ స్కూలు కేంద్రాలుగా మార్చుతున్నట్టు చెప్పారు. ఒక్కోప్రీ స్కూలు కేంద్రానికి రూ.2.40 లక్షలు చొప్పున వ్యయం చేయనున్నట్టు తెలిపారు.  ప్రీ స్కూళ్ల నిర్వహణ బాధ్యతను పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ, స్త్రీ, శిశు సంక్షేమ శాఖలు స్వీకరిస్తాయని, మూడేళ్ల వయసున్న చిన్నారులు నర్సరీ, నాలుగేళ్ల వయస్సున్నవారు ఎల్‌కేజీ, నాలుగు నుంచి ఐదేళ్ల వయస్సుంటే యూకేజీ చదివేందుకు వీలుందన్నారు. 

Videos

టీడీపీ,బీజేపీ విధ్వంసం సృష్టించారు: పేర్ని నాని

కుండపోత వర్షం హైదరాబాద్ జలమయం

ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై కేంద్రం కీలక ప్రకటన..

ఏలూరు లో ఘోరం..!

డీలా పడ్డ కూటమి

ఈసీకి వివరణ

మేము ఇచ్చిన పథకాలు,అభివృద్దే మమ్మల్ని గెలిపిస్తుంది

కృష్ణా జిల్లాలో అరాచకం సృష్టిస్తున్న పచ్చ పార్టీ నేతలు

విజయం పై జగన్ ఫుల్ క్లారిటీ..

Live: విజయం మనదే..మరోసారి అధికారంలోకి వస్తున్నాం.

Photos

+5

Sireesha: భర్తతో విడాకులు.. ట్రెండింగ్‌లో తెలుగు నటి (ఫోటోలు)

+5

ఫ్యాన్స్‌లో నిరాశ నింపిన వర్షం.. తడిసిన ఉప్పల్ స్డేడియం (ఫోటోలు)

+5

లవ్‌ మీ సినిమా స్టోరీ లీక్‌ చేసిన బ్యూటీ, క్లైమాక్స్‌ కూడా చెప్పకపోయావా! (ఫోటోలు)

+5

Hyderabad Heavy Rains: హైదరాబాద్‌లో కుండపోత వాన.. భారీగా ట్రాఫిక్‌ జాం (ఫొటోలు)

+5

‘సర్‌.. నేను మీ అమ్మాయిని లవ్‌ చేస్తున్నా’.. 13 ఏళ్ల ప్రేమ, పెళ్లి! (ఫొటోలు)

+5

మిస్టర్‌ అండ్ మిసెస్ మహీ చిత్రంలో జాన్వీ.. ధోనిపై ఆసక్తికర కామెంట్స్ చేసిన భామ (ఫొటోలు)

+5

International Family Day: ఐపీఎల్‌ స్టార్లు, కెప్టెన్ల అందమైన కుటుంబాలు చూశారా? (ఫొటోలు)

+5

వారి కోసం విరుష్క స్పెషల్‌ గిఫ్ట్‌.. ఎందుకంటే? (ఫొటోలు)

+5

తిరుపతి కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన యువకుడు

+5

త్రినయని సీరియల్‌ నటి కన్నుమూత.. తిరిగి వచ్చేయంటూ నటుడు ఎమోషనల్‌ (ఫోటోలు)