amp pages | Sakshi

185వ రోజు పాదయాత్ర డైరీ

Published on Mon, 06/11/2018 - 02:17

10–06–2018, ఆదివారం   
గౌరిపల్లి, పశ్చిమగోదావరి జిల్లా

బాబుగారి వంచనకు గురికాని ఒక్క కులమూ లేదంటే అతిశయోక్తి కాదేమో..
అఖండ గోదావరి తీరం.. గోష్పాద క్షేత్రం ఉన్నటువంటి కొవ్వూరు నియోజకవర్గంలో ఈ రోజు పాదయాత్ర సాగింది. శిబిరం నుంచి బయటకు రాగానే తాడిపర్రు గ్రామానికి చెందిన సోదరుడు నిస్సీకుమార్‌ తన ఇద్దరు చిన్నారులైన ఆడబిడ్డలతో వచ్చి కలిశాడు. మూడునాలుగేళ్ల వయసున్న ఆ పసిబిడ్డలు దేశంకాని దేశంలో.. ఆచూకీ లేని అమ్మకోసం అల్లాడిపోతున్నారని తెలిసి చాలా బాధేసింది. కూలి పనులు చేసుకుని బతికే కుటుంబం వారిది. గల్ఫ్‌ దేశాలకు పోతే బతుకులు బాగుపడతాయని, పిల్లల భవిష్యత్తు బాగుంటుందన్న ఆశతో.. ఏజెంట్ల మాయమాటలు నమ్మి ఆ బిడ్డల తల్లి ఖతర్‌ దేశానికి పోయిందట.

మొదట్లో అక్కడ శారీరక, మానసిక వేధింపులను భరించలేకపోతున్నానని.. వెనక్కి వచ్చేస్తానని ఏడ్చేదట. ఆ తర్వాత కొద్ది నెలలుగా ఆమె నుంచి ఎలాంటి సమాచారమూ లేదట. ఏజెంట్ల దగ్గరకు వెళ్లి వెనక్కు రప్పించమంటే.. మా బాధ్యత కాదంటున్నారట. దిక్కుతోచని స్థితిలో పోలీస్‌స్టేషన్‌లో కంప్లైంట్‌ ఇస్తే పట్టించుకోవడం లేదట. కారణం.. ఆ ఏజెంట్లకు టీడీపీ నాయకుల అండదండలు ఉండటమేనంటూ కన్నీటి పర్యంతమయ్యాడు నిస్సీకుమార్‌.

స్థానికంగా సరైన ఉపాధి అవకాశాలు లేకపోవడంతో పొరుగు రాష్ట్రాలకు, గల్ఫ్‌ దేశాలకు వలసపోయి పడరాని కష్టాలు పడుతున్నవారి గాథలు వింటుంటే.. మనసంతా కలచివేసింది. మొన్న సురేష్‌గౌడ్‌.. నేడు ఈమె.. ఇలా ఎందరెందరో. లక్షలాది మందికి ఉపాధి అవకాశాలు కల్పించామంటూ గొప్పలు చెప్పుకొనే పాలకులు క్షేత్ర స్థాయిలో ఉపాధి హామీ పథకం మొదలుకుని.. ఉద్యోగం, ఉపాధి అవకాశాలు కల్పించే అన్ని రంగాలనూ నిర్వీర్యం చేస్తున్నంత కాలం పేదలకు ఈ వలస బాధలు, కన్నీటి వ్యథలు తప్పవు.  

ప్రతిభకు పేదరికమే అడ్డంకిగా మారింది. ప్రభుత్వ ప్రోత్సాహమూ కరువైంది. నిరుపేద కూలి కుటుంబంలో జన్మించిన పరుగుల రాణి నాగాంజలి కష్టం తెలిసి చాలా బాధేసింది. తినడానికి సరిగా తిండిలేకున్నా.. పోటీలకు వెళ్లడానికి ఖర్చులకు సైతం డబ్బు లేకున్నా.. జాతీయ పోటీలలో పాల్గొనడానికి బూట్లు కూడా కొనలేని దుస్థితిలో ఉన్నా.. పట్టుదలతో రాష్ట్ర, జాతీయ స్థాయిలలో పదుల సంఖ్యలో పతకాలు సాధించిన ఆ చెల్లెమ్మ మట్టిలో మాణిక్యమే.

అటువంటి చెల్లెమ్మ పేదరికం కారణంగా పరుగును ఆపాల్సి వస్తోందని ఆందోళన చెందింది. ‘ప్రభుత్వం నుంచి కనీస ప్రోత్సాహమూ లేదు సార్‌.. మాలాంటి వారికి కాపు కార్పొరేషన్‌ నుంచి కూడా సాయం అందదు’ అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు నాగాంజలి తండ్రి. క్రీడాకారులను ప్రోత్సహించడంలో సైతం వివక్ష చూపుతూ, ఓ వైపు.. తనకు రాజకీయ లబ్ధి, ప్రచారము ఉన్నచోట్ల కోట్లు కుమ్మరిస్తూ, మరోవైపు.. ఇలాంటి ప్రతిభావంతులైన గ్రామీణ నిరుపేద క్రీడాకారులను గాలికొదిలేస్తున్న పాలకుల తీరు గర్హనీయం.    

 మల్లవరంలో జరిగిన బీసీల ఆత్మీయ సమ్మేళనంలో ఉన్నంతసేపూ చంద్రబాబు మోసాలు ఒక్కొక్కటీ మదిలో మెదిలాయి. వందలాది సంక్షేమ హాస్టళ్లను మూసివేసి.. బీసీ విద్యార్థులను రోడ్డుపాల్జేయడం గుర్తొచ్చింది. పేద విద్యార్థుల అభ్యున్నతికి జీవనాడి అయిన ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకాన్ని నీరుగార్చడం వల్ల మధ్యలోనే చదువులు ఆగిపోయిన ఎందరో బీసీ విద్యార్థుల కన్నీటి కథలు గుర్తొచ్చాయి.

బీసీ న్యాయవాదులకు న్యాయమూర్తులుగా నియమితులయ్యే సమర్థత, సచ్ఛీలత లేవంటూ చంద్రబాబు రాసిన లేఖ గుర్తొచ్చింది. మేనిఫెస్టోలో ప్రతి కులానికి ఒక పేజీ కేటాయించి మోసం చేసిన వైనం, ఇచ్చిన హామీలను గుర్తుచేసిన బీసీలను తాట తీస్తానంటూ బెదిరించిన చంద్రబాబు దురహంకారమూ గుర్తొచ్చాయి.. బాబుగారి వంచనకు గురికాని ఒక్క కులమూ లేదంటే అతిశయోక్తి కాదేమో.  

ముఖ్యమంత్రిగారికి నాదో ప్రశ్న.. వెనుకబడిన కులాలవారిపై మీరు కపట ప్రేమ ఒలకబోస్తూ.. వారిని సామాజిక, విద్య, ఆర్థికపరంగా నిజమైన అభ్యున్నతి సాధించనీయకుండా.. కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే పరిగణించడం నిజం కాదా? మీ రాజకీయ లక్ష్యాలు సాధించుకోవడం కోసం బలహీన వర్గాలను నిచ్చెనమెట్లుగా వాడుకోవడం.. గద్దెనెక్కాక నిచ్చెనను తన్నేసినట్టు వ్యవహరించడం.. మోసం కాదా?

Videos

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)