TS Medak Assembly Constituency: తండ్రీకొడుకుల మధ్యే పోటీ.. అందోలు బీజేపీ టికెట్‌పై ఉత్కంఠ!
Sakshi News home page

టికెట్టు కోసం తండ్రీకొడుకులు పోటీ.. అందోలు బీజేపీ టికెట్‌పై ఉత్కంఠ!

Published Thu, Oct 26 2023 7:52 AM

- - Sakshi

సాక్షి, మెదక్‌: అందోలు నియోజకవర్గ బీజేపీ టికెట్టు కోసం తండ్రీకొడుకులు పోటీ పడడం స్థానికంగా చర్చనీయాంశమైంది. మొదటి నుంచి కుటుంబ సభ్యులను రాజకీయాలకు దూరంగా ఉంచే మాజీ మంత్రి బాబూమోహన్‌ టికెట్ల కేటాయింపు సమయంలో కుమారుడు ఉదయ్‌బాబూమోహన్‌ పేరు తెరపైకి రావడాన్ని ఆయన్‌ వర్గీయులు జీర్ణించుకోలేకపోతున్నారు.

బీఆర్‌ఎస్‌ పార్టీలో చేరి..
► అందోలు ఎమ్మెల్యేగా 1998లో జరిగిన ఉప ఎన్నికల్లో గెలుపొంది, 1999 సాధారణ ఎన్నికల్లో తిరిగి రెండోసారి టీడీపీ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా ఎన్నికై నియోజకవర్గంలో పట్టు సాధించారు. 2004, 2009 ఎన్నికల్లో మాజీ డిప్యూటీ సీఎం దామోదర్‌ రాజనర్సింహా చేతిలో బాబూమోహన్‌ ఓడిపోయారు.
► రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014లో బాబూమోహన్‌ బీఆర్‌ఎస్‌ పార్టీలో చేరి ఎమ్మెల్యేగా గెలుపొందారు.
► 2018 ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ టికెట్‌ను నిరాకరించడంతో బీజేపీ పార్టీలో చేరి ఆ పార్టీ తరఫున పోటీ చేసి ఓడిపోయారు.
► ప్రస్తుతం 2023 ఎన్నికల్లో బీజేపీ 52 మంది అభ్యర్థులతో ప్రకటించిన జాబితాలో బాబూమోహన్‌ పేరు లేదు. ఆయన కుమారుడు ఉదయ్‌బాబూమోహన్‌ పేరును పార్టీ అధిష్టానం పరిశీలిస్తున్నందని, అందుకే మొదటి జాబితాలో అవకాశం దలేదని పార్టీ వర్గాలు అంటున్నాయి.
► ఉదయ్‌బాబూ మోహన్‌ పేరును బీజేపీ తరఫున కేటాయిస్తున్నట్లు ప్రముఖ టీవీల్లో ప్రచారం కావడంతో నియోజకవర్గంలో చర్చించుకుంటున్నారు. రెండు మాసాల క్రితం పార్టీ సీనియర్‌ నాయకుడు జితేందర్‌రెడ్డి అందోలు టికెట్‌ను ఉదయ్‌బాబుకు ఇద్దామని బాబూమోహన్‌తో అన్నట్లు పార్టీ నాయకులు మాట్లాడుకుంటున్నారు.
► అప్పటి నుంచి ఉదయ్‌బాబును నియోజకవర్గానికి దూరంగా ఉంచేందుకు బాబూమోహన్‌ ప్రయత్నిస్తున్నట్లు నాయకులు చెబుతున్నారు. అందోలు బీజేపీ టికెట్‌ను మా జీ జెడ్పీ చైర్మన్‌ బాలయ్య కూడా ఆశిస్తున్న విషయం తెలిసిందే.
► అందోలు టికెట్‌ తనకే కేటాయించాలని పార్టీ అధిష్టానవర్గంపై బాబూమోహన్‌ ఒత్తిడి తెస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఈ టికెట్‌పై తండ్రీకొడుకుల మధ్యే పంచాయితీ ఏర్పడే అవకాశం ఉందని స్థానికులు భావిస్తున్నారు.

Advertisement
Advertisement