ఇంకెన్నాళ్లు ఈ దారుణాలు.. ఇంకెంతకాలం భరించాలి: నటి ఆవేదన | Sakshi
Sakshi News home page

Sona Heiden: మనుషులా.. మృగాలా..ఈ దుస్థితి ఇంకెన్నాళ్లు: సోనా ఆవేదన

Published Sun, Mar 10 2024 11:01 AM

Tamil Actress Sona Heiden Reacts On puduchery Girl Incident - Sakshi

నటి సోనా గురించి ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే ఈమె బహు భాషా నటి. అంతకు మించి ఏదో ఒక ఘటనతో వార్తలో తరచుగా కనిపించే నటి. శృంగార తారగానూ ముద్ర వేసుకున్న సోనాలో నిర్మాత, దర్శకురాలు కూడా ఉన్నారు. తాజాగా తన బయోపిక్‌ను స్మోక్ అనే‌ పేరుతో స్వీయ దర్శకత్వంలో వెబ్‌ సిరీస్‌గా రూపొందిస్తున్నారు. కాగా ఇటీవల పాండిచ్చేరిలో జరిగిన బాలిక అత్యాచారం, హత్యా ఘటనపై స్పందించింది. 

ఈ రోజు మనం ప్రపంచ మహిళా దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్నామని.. కానీ ఇటీవల పాండిచ్చేరిలో చిన్నారికి జరిగిన దారుణ ఘటన తీవ్ర వేదనకు గురి చేసిందన్నారు. దీన్ని అందరూ ఖండించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఒక అమ్మాయిగా ఎలా ఉండాలో అనేది కూడా తెలియని ఆ బాలికను చిత్ర వధ చేసి ప్రాణాలు తీయడం తీవ్రంగా పరిగణించాలన్నారు. ఇలాంచి క్రూరమైన ఘటనతో మనం మానవ సమాజంలోనే బతుకుతున్నామా? లేక మృగాల మధ్య జీవిస్తున్నామా? అని తెలియడం లేదన్నారు. 

ఒక నటిగా తానూ ఇలాంటి సంఘటనలను ఎదుర్కొని బయట పడ్డానని చెప్పారు. మృగాల్లాంటి మగాళ్ల మధ్య జీవించడానికి.. రక్షించుకోవడానికి అనునిత్యం పరుగులు తీస్తూనే ఉన్నామన్నారు. ఈ దుస్థితి ఇంకెన్నాళ్లు అని ప్రశ్నించారు. అభివృద్ధి చెందుతున్న ఈ నాగరిక ప్రపంచంలో మహిళలను అణచివేయడం.. కించపరచడం, తప్పుగా చిత్రీకరించడడం కొనసాగుతూనే ఉందన్నారు. ఇలాంటి పరిస్థితిని ఇంకా ఎంతకాలం మౌనంగా భరించాలి.. ఇకపై ఇలాంటి చర్యలకు పాల్పడేవారికి తగిన బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందని నటి సోనా పేర్కొన్నారు. 

Advertisement
Advertisement