పరారీలో టీడీపీ నేత మాండ్ర శివానందరెడ్డి | Sakshi
Sakshi News home page

పరారీలో టీడీపీ నేత మాండ్ర శివానందరెడ్డి

Published Tue, Apr 2 2024 3:33 AM

TDP Sivananda Reddy Land Grabbing Case - Sakshi

పోలీసుల్ని ఏమార్చి పరారైన టీడీపీ నంద్యాల పార్లమెంట్‌ ఇన్‌చార్జి

అసైన్డ్‌ భూముల గోల్‌మాల్‌ వ్యవహారంపై కేసులు 

బుద్వేల్‌ వద్ద 26 ఎకరాలు చేజిక్కించుకున్న వైనం  

ప్రీలాంచ్‌ ఆఫర్ల పేరుతో అడ్వాన్స్‌లు వసూలు

అరెస్ట్‌ చేసేందుకు నంద్యాల జిల్లా అల్లూరులో హైదరాబాద్‌ పోలీసుల యత్నం  

నోటీసులు ఇవ్వమని డిమాండ్‌ చేసిన ఈ మాజీ పోలీసు అధికారి  

అధికారులు ఆ పనిలో ఉండగా కారులో ఉడాయింపు  

భార్య, కుమారుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు

సాక్షి, నంద్యాల/సాక్షి, హైదరాబాద్‌: టీడీపీ నంద్యాల పార్లమెంట్‌ ఇన్‌చార్జి మాండ్ర శివానందరెడ్డిని ఓ భూ వివాదం కేసులో అరెస్టు చేసేందుకు తెలంగాణ పోలీసులు ప్రయత్నించారు. ఆయన వా­రి కళ్లుగప్పి పరారయ్యారు. ఈ నేపథ్యంలో ఆయన భార్యను, కుమారుడిని హైదరాబాద్‌లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అసైన్డ్‌ భూముల కొనుగోలు పంచాయితీకి సంబంధించి భాగస్వాముల వివాదాలతో హైదరాబాద్‌ నగర నేర పరిశోధన విభాగం (సీసీఎస్‌)లో కేసులు నమోదయ్యాయి. వీటిని దర్యాప్తు చేస్తున్న నేపథ్యంలో మాజీ పోలీసు అధికారి అయిన శివానందరెడ్డి నిబంధనలకు విరుద్ధంగా అసైన్డ్‌ భూములు కొనుగోలు చేయడం, వాటిలో నిర్మాణాల పేరుతో ప్రీలాంచ్‌ ఆఫర్లు ఇచ్చి అడ్వాన్సులు వసూలు చే­య­డం వంటి పలు విషయాలు వెలుగులోకి వచ్చాయి.

దీంతో శివానందరెడ్డిని అరెస్టు చేసేందుకు హైదరాబాద్‌ సీసీఎస్‌ పోలీసులు సోమ­వారం నంద్యాల జిల్లా అల్లూరు గ్రామంలో ఆయ­న ఇంటికి వచ్చారు. భూ కబ్జాకు సంబంధించిన కేసులో విచారణకు సహకరించాలని ఆయన్ని కోరారు. నోటీసులు ఇవ్వకుండా తాను సహకరించనని మాండ్ర చెప్పారు. దీంతో పోలీసులు నోటీసులను సిద్ధం చేసే పనిలో నిమగ్నమయ్యా­రు. ఈ సమాచారం తెలుసుకున్న టీడీపీ శ్రేణులు శివానందరెడ్డి ఇంటికి చేరుకుని పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఈ సమయంలోనే శివానందరెడ్డి పోలీసుల కళ్లుగప్పి కారులో పరారయ్యారు.

ఆయన్ని వెంబడించేందుకు ప్రయత్నించిన పోలీసుల్ని టీడీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. పోలీసులు బయటికి వెళ్లకుండా ఆయన అనుచరులు గేట్లు మూసేశారు. దీంతో మాండ్ర తప్పించుకుని పారిపోయారు. దీంతో హైదరాబాద్‌లో ఉన్న సీసీఎస్‌ పోలీసులు నగరంలోని తారామతి బారాదారి వద్ద ఉన్న వెస్సెల్లా మెడోస్‌లోని శివానందరెడ్డి ఇంటిపై దాడిచేశారు. ఆయన భార్య ఉమాదేవిని, కుమారుడు కనిష్‌్కరెడ్డిని, ప్రశాంత్‌రెడ్డిని అదుపులోకి తీసుకుని సీసీఎస్‌ కార్యాలయానికి తరలించారు.

పరారీలో ఉన్న శివానందరెడ్డి కోసం పోలీసులు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌తో పాటు కర్ణాటకలోను ముమ్మరంగా గాలిస్తున్నారు. శివానందరెడ్డి తమ విధులకు ఆటంకం కలిగించి పరారయ్యారని సీసీఎస్‌ పోలీసులు బ్రాహ్మణకొట్కూరు పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు దీనిపై కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో శివానందరెడ్డి సెల్ఫీ వీడియో విడుదల చేశారు. తాను భూ కబ్జాలకు పాల్పడలేదని, కేసుకు సంబంధించిన పూర్తి సమాచారం ఇస్తే విచారణకు సహకరిస్తానని అందులో పేర్కొన్నారు.  

బుద్వేల్‌లోని అసైన్డ్‌ భూములు కేంద్రంగా..  
సీఐడీలో సైబర్‌ క్రైమ్‌ ఎస్పీగా పనిచేస్తూ వాలంట­రీ రిటైర్‌మెంట్‌ తీసుకున్న శివానందరెడ్డి 2019లో తెలుగుదేశం పార్టీ తరఫున నంద్యాల ఎంపీ అభ్యరి్థగా పోటీచేసి ఓడిపోయారు. ఇప్పుడు టీడీపీ నంద్యాల పార్లమెంట్‌ ఇన్‌చార్జిగా ఉన్న ఆయన హైదరాబాద్‌ బుద్వేల్‌లోని అసైన్డ్‌ భూములు కేంద్రంగా పా­ల్పడిన నేరం బయటపడింది. రాజేంద్ర­నగర్‌ శివా­రులో ఉన్న ఈ ప్రాంతంలోని 282, 283, 284, 289 సర్వే నంబర్లలో 480 ఎకరాల ప్రభుత్వ భూ­మి ఉంది. దీన్ని 1986లో అప్పటి ప్రభుత్వం అసైన్డ్‌ ల్యాండ్‌గా ప్రకటిస్తూ దళితులకు పంపిణీ చేసింది.

అనంతర పరిణామాల నేపథ్యంలో 1997­­లో అప్ప­టి ప్రభుత్వం ఈ భూ­ముల్ని వెనక్కి తీసుకుంది. దీ­న్ని సవాల్‌ చేస్తూ అసైనీలు న్యాయస్థానా­న్ని ఆశ్ర­యించారు. సుదీర్ఘ న్యాయపోరాటం త­ర్వా­­త అక్కడున్న అసైనీలతోపాటు అప్పటికే ఆ స్థలా­ల్లో ఉంటున్న వారికీ న్యాయం చేయాలని ఆదేశాలొచ్చా­యి. 2008లో వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ప్రభు­త్వం ఒక్కో అసైనీకి 800 చదరపు గజాలు కేటాయిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. వారికి విక్రయించే హక్కుల్ని మాత్రం ఇవ్వలేదు. దీంతో అసైనీలు విక్రయహక్కు­ల కోసం ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నా­రు. మొత్తం మీద ఒక్కో అసైనీకి 800 చదరపు గజాల చొప్పున 66 మందికి, ఆ స్థలంలో ఉంటున్న ఒక్కొక్కరికి 400 చదరపు గజాల చొ­ప్పు­న 82 మందికి ఇచ్చే ప్రయత్నాలు జరిగాయి.

భాగస్వాముల విభేదాలతో..
ఈ నేపథ్యంలో ఈ భూముల కోసం టి.జె.ప్రకాష్, కోనేరు గాంధీ, ఎస్‌.దశరథరామారావు రంగంలోకి దిగారు. అసైనీలుగా ఉన్న గుంటి నర్సింహులు తదితరులతో 69,200 చదరపు గజాల స్థలంపై అవగాహన ఒప్పందాలు (ఎంవోయూలు) చేసుకున్నారు. వీరికి చెల్లింపులు చేయడానికి గూడూరు కృష్ణ, రవి రాంబాబు, ఎంసీహెచ్‌ రాఘవరావు తదితరుల నుంచి 2014, 2018ల్లో పెట్టుబడులు తీసుకున్నారు. ఆ సందర్భాల్లో సర్వే నంబర్లు 282, 289ల్లో ఉన్న స్థలం నుంచి కొంతభాగం వీరికి ఇచ్చేలా, అది అసైన్డ్‌ భూమి కావడంతో గరిష్టంగా ఆరునెలల్లో ప్రభుత్వం నుంచి అన్ని అనుమతులు పొందేలా ఒప్పందాలు చేసుకున్నారు. 2022 నాటికీ ఈ తంతు పూర్తిగాకపోవడంతో భాగస్వాముల మధ్య విభేదాలు తలెత్తాయి. దీంతో గూడూరు కృష్ణ, రవి రాంబాబు, ఎంసీహెచ్‌ రాఘవరావు తదితరులు సీసీఎస్‌లో ఫిర్యాదు చేయడంతో 2022 అక్టోబర్‌ 18న ప్రకాష్, గాం«దీ, దశరథ్‌లపై నాలుగు కేసులు నమోదయ్యాయి

వీటి దర్యాప్తులో ఆయన పాత్ర వెలుగులోకి..
ఈ నాలుగు కేసుల దర్యాప్తులో శివానందరెడ్డితో పాటు ఆయన భార్య ఉమాదేవి, కుమారుడు డైరెక్టర్లుగా ఉన్న కంపెనీ పాత్ర వెలుగులోకి వచి్చంది. 2015–16లో రంగంలోకి దిగిన శివానందరెడ్డి తాను బయటకు రాకుండా టి.జె.ప్రకాష్, కోనేరు గాందీ, ఎస్‌.దశరథరామారావులను ముందుపెట్టి కథ నడిపారు. ఆ భూముల్ని తన కంపెనీ పేరుతో రాయించుకోవడంతోపాటు రాత్రికిరాత్రే అనుమతి జీవోలు తెప్పించుకున్నారని వెలుగులోకి వచ్చింది. పట్టాలు కూడా అసైనీలకు ఇవ్వకుండా, లేఔట్‌ కూడా వేయకుండా వారిని భయపెట్టి రిజి్రస్టేషన్లు కూడా పూర్తిచేసినట్లు సీసీఎస్‌ పోలీసులు గుర్తించారు.

గజం కనిష్టంగా రూ.12 వేల నుంచి రూ.15 వేలకు సొంతం చేసుకున్నట్లు బయటపడింది. ఈ విషయాలు వెలుగులోకి రావడంతో కేసులు మరో మలుపు తిరిగాయి. ఈ వ్యవహారంలో అప్పటి కొందరు అధికారుల పాత్ర కూడా ఉన్నట్లు తేలింది. జనవరిలో కోర్టు అనుమతితో సీసీఎస్‌ పోలీసులు శివానందరెడ్డికి చెందిన వెస్సెల్లా గ్రూప్‌ కార్యాలయాల్లోను, ఆయన ఇంట్లోను సోదాలు చేశారు.

పలు కీలక డాక్యుమెంట్లు స్వా«దీనం చే­సు­కున్నారు. మొత్తం 26 ఎకరాల అసైన్డ్‌ భూము­ల్ని చేజిక్కించుకున్న శివానందరెడ్డి.. వెస్సెల్లా గ్రూప్‌ పేరిట 400 చదరపు గజాలు (5 వేల చదరపు అడుగుల బిల్డప్‌ ఏరియా), 800 చదరపు గజాల (10 వేల చదరపు అడుగుల బిల్డప్‌ ఏరి­యా) విస్తీర్ణంలో లగ్జరీ విల్లాలు నిర్మిస్తామని ప్రచా­రం చేయడమేగాక ప్రీ లాంచ్‌ ఆఫర్ల పేరు­తో చదరపు అడుగుకి రూ.10 వేల చొప్పున అనేకమంది నుంచి అడ్వాన్సులు సైతం వసూలు చే­శా­రని ఈ డాక్యుమెంట్ల ఆధారంగా గుర్తించారు.

Advertisement
Advertisement