పెరుగుతున్న క్యాష్‌ విత్‌డ్రాలు! | Sakshi
Sakshi News home page

యూపీఐ ఉన్నా నగదు ఉపసంహరణకే ప్రాధాన్యం

Published Tue, Apr 30 2024 3:08 PM

Though rise of UPI payments in India 5.51 percent increase in average atm withdrawals

భారత్‌లో యూపీఐ చెల్లింపులు పెరుగుతున్నప్పటికీ గతేడాది ఏటీఎంల నుంచి చేసే నగదు ఉపసంహరణలు 5.51 శాతం పెరిగినట్లు తాజాగా సీఎంఎస్‌ నివేదిక వెల్లడించింది. దేశ ఆర్థిక వృద్ధి రేటు 9 శాతం పెరుగుతుందని అంచనాలు వెలువడుతున్నా ఆ మేరకు నగదు ఉపసంహరణ మాత్రం పెరగడంలేదని నివేదిక ద్వారా తెలిసింది.

2022-23 ఆర్థిక సంవత్సరంలో చేసిన నగదు ఉపసంహరణల కంటే 2023-24లో చేసిన నెలవారీ విత్‌డ్రాలు సగటున 7.23 శాతం ఎక్కువగా ఉన్నాయి. గతేడాదిలో మెట్రోనగరాల్లో విత్‌డ్రా చేసిన సగటు నగదు అంతకుముందు ఏడాదికంటే 10.37 శాతం పెరిగింది. సెమీ-అర్బన్, గ్రామీణ ప్రాంతాల్లో 3.94 శాతం పెరుగుదల కనిపించింది.

భారత్‌లో గతేడాది ఏటీఎంల ద్వారా అధికంగా డబ్బు తీసుకున్న ఉత్తరాది ప్రాంతాల్లో దిల్లీ, ఉత్తరప్రదేశ్‌లు ఉన్నాయి. దక్షిణాదిలో తమిళనాడు, కర్ణాటక ప్రజలు అధికంగా డబ్బు విత్‌డ్రా చేశారు. ప్రభుత్వ రంగ బ్యాంకులకు సంబంధించి 49 శాతం ఏటీఎంలు మెట్రోపాలిటన్, పట్టణ ప్రాంతాల్లో ఉండగా, 51 శాతం ఏటీఎంలు సెమీ అర్బన్‌, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నాయి.

ప్రైవేట్ రంగ బ్యాంకులకు సంబంధించి 64 శాతం ఏటీఎంలు మెట్రోపాలిటన్, పట్టణ ప్రాంతాల్లో ఉన్నాయి. 36 శాతం ఏటీఎంలు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నట్లు తెలిసింది.

Advertisement
Advertisement