యూజ్‌లెస్‌ ఫెలో.. గెట్ లాస్ట్ అన్నారు! అక్కడే చైర్మన్‌ అయ్యాను.. | Sakshi
Sakshi News home page

Dr K. Sivan: యూజ్‌లెస్‌ ఫెలో.. గెట్ లాస్ట్ అన్నారు! అక్కడే చైర్మన్‌ అయ్యాను..

Published Sun, Oct 15 2023 2:58 PM

Ex ISRO Chief Dr K Sivan Recalled That He Was Not Hired at ISRO in His First Attempt - Sakshi

ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో) మాజీ చీఫ్ డాక్టర్ కె శివన్ తన మొదటి ప్రయత్నంలో అంతరిక్ష సంస్థలో జాబ్ పొందలేకపోయాయని 'నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ' (NIT) గోవా తొమ్మిదవ కాన్వకేషన్‌లో వెల్లడించాడు. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

చదువు పూర్తయిన తరువాత నేను టీచర్ అవ్వాలనుకున్నాను, అయితే అంతరిక్ష సంస్థకు ఛైర్మన్‌గా మారాను అంటూ గుర్తు చేసుకున్నారు. మాస్టర్ డిగ్రీ పూర్తి చేసిన తరువాత ఉద్యోగం కోసం ఇస్రో కేంద్రానికి వెళితే అక్కడ యూజ్‌లెస్‌ ఫెలో.. నీకు జాబ్ రాదు.. గెట్ లాస్ట్ అన్నారని వెల్లడించాడు. ఇలా అనిపించుకున్న తరువాత, చివరకు అదే సెంటర్‌కు చైర్మన్‌ అయ్యానని చెప్పుకొచ్చాడు.

మొదట శాటిలైట్‌ సెంటర్‌లో ఉద్యోగం రాకపోవడంతో రాకెట్‌ సెంటర్‌లో ఉద్యోగం సంపాదించి ఆ తరువాత అప్పటికే నాలుగు సార్లు విఫలమైన జియోసింక్రోనస్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (GSLV) ప్రాజెక్ట్ డైరెక్టర్‌గా బాధ్యత తీసుకున్నప్పుడు స్నేహితులు, సన్నిహితులు నువ్వు పెద్ద మూర్ఖుడివి అంటూ విమర్శించారని వెల్లడించారు.

ఎన్నెన్నో విమర్శలు ఎదుర్కొని జీఎస్‌ఎల్‌వీ ప్రాజెక్టును విజయవంతం చేసానని శివన్ చెప్పాడు. ఈ విజయం ఇస్రో కమ్యూనిటీకి కనపడేలా చేయడంతో ఇస్రో చైర్మన్‌ పదవి కూడా వరించిందని తెలిపాడు.

నిజానికి నా జీవితంలో ఓ గొప్ప విషయం నేర్చుకున్నాను, అదేంటంటే.. మీరు ఎక్కడైనా విమర్శలకు, తిరస్కరణకు గురైతే తప్పకుండా మీ కోసం మరో గొప్ప అవకాశం మరొకటి వేచి ఉంటుందని శివన్ చెప్పారు.

ఇదీ చదవండి: మామకు తగ్గ మేనల్లుడు.. అర్జున్ కొఠారి ఆస్తులు ఇన్ని కోట్లా?

ఆ తరువాత చంద్రయాన్ 2 మిషన్ ప్రారంభమైంది. దీనిని 2019 జూలై 22న అంతరిక్షంలో పంపించారు, కానీ అది 2019 సెప్టెంబరు 7 విఫలమైనట్లు తెలిసింది. ఆ తరువాత చంద్రయాన్‌-3తో ముందుకు వెళ్లేందుకు స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీ నుంచి ఆమోదం లభించిందని చెప్పారు.

డాక్టర్ కె శివన్ గురించి
ఏప్రిల్ 1957లో కన్యాకుమారిలోని తారక్కన్‌విలై గ్రామంలో ఒక మామిడి రైతుకు జన్మించిన 'శివన్' పాఠశాల విద్యను తమిళ మాధ్యమ పాఠశాల నుంచి, ఆ తరువాత 1980లో మద్రాస్ యూనివర్శిటీ ఆఫ్ టెక్నాలజీ నుంచి ఏరోనాటికల్ డిగ్రీ పూర్తి చేసాడు.1982లో బెంగుళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ నుంచి ఏరోస్పేస్ ఇంజినీరింగ్‌లో మాస్టర్స్ డిగ్రీని పొంది ఇస్రోతో కలిసి పనిచేయడం ప్రారంభించాడు.

2006లో ఐఐటీ బాంబే నుంచి ఏరోస్పేస్ ఇంజినీరింగ్‌లో డాక్టరల్ డిగ్రీ కూడా సొంతం చేసుకున్నాడు. ఈయన పీఎస్‌ఎల్‌వి, జీఎస్‌ఎల్‌వి, జీఎస్‌ఎల్‌వి MkIII వంటి ప్రాజెక్టుల్లో కూడా పనిచేశాడు. ఆ తరువాత 2022 జనవరిలో ఇస్రో ఛైర్మన్‌గా ఎస్ సోమనాథ్ బాధ్యతలు స్వీకరించాడు.

Advertisement
Advertisement