'సోషల్ మీడియా చూడొద్దు' | Sakshi
Sakshi News home page

'సోషల్ మీడియా చూడొద్దు'

Published Thu, Jul 2 2015 9:31 AM

'సోషల్ మీడియా చూడొద్దు' - Sakshi

జైసల్మేర్: ప్రపంచమంతా టెక్నాలజీ వెంట పరుగులు పెడుతోంది. దేశం మొత్తానికి హైస్పీడ్ ఇంటర్నెట్ అందించే లక్ష్యంతో ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం 'డిజిటల్ ఇండియా' కు శ్రీకారం చుట్టారు. ఇంత చేస్తున్నా సాంకేతిక పరిజ్ఞాన ఫలితాలు గ్రామీణులకు అందడం లేదు. మౌలిక సదుపాయాల లేమి, సంప్రదాయవాదుల నియంత్రణలు అడ్డుగోడలుగా మారుతున్నాయి.

గ్రామాల్లోని బాలికలు సెల్ ఫోన్స్ వాడొద్దని,  సోషల్ మీడియా చూడరాదంటూ రాజస్థాన్ లోని బార్మెర్ జిల్లాలో 'ఖాప్' పెద్దలు ఫర్మానా జారీచేశారు. అంతేకాదు గాల్స్ జీన్స్ ధరించరాదని హెచ్చరించారు. పెళ్లి సమయంలోవరుడు తప్పనిసరిగా పంచె కట్టుకోవాలని ఆదేశించారు. వధువు గాగ్రా ధరించాలని సూచించింది. 'ఖాప్' ఆదేశాలపై ఆధునికవాదులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement
Advertisement