తండా నుంచి వండర్ | Sakshi
Sakshi News home page

తండా నుంచి వండర్

Published Sun, Apr 17 2016 2:23 AM

Wonder  From of   the danda

తల్లిదండ్రులు నిరక్షరాస్యులు... నివసించేది మారుమూల తండా.. కుటుంబంలో తనతో పాటు తన కంటే పెద్దవారైన ముగ్గురిని చదివించడానికి వారు పడిన కష్టాన్ని చూశాడు.  అన్నం పెట్టే సాగుభూమిని అమ్ముతున్న కన్నవారి ఆవేదనను గమనించాడు. మళ్లీ తల్లిదండ్రుల కళ్లలో ఆనందం చూడాలంటే తాను బాగా చదువుకుని ఉన్నత స్థారుుకి ఎదగాలని అప్పట్లోనే నిర్ణరుుంచుకున్నాడు. అంతటితోనే వదిలివేయకుండా కష్టపడి చదివాడు. మొదటి నుంచి ప్రభుత్వ పాఠశాలల్లోనే చదువుకున్న ఆయన.. ఎన్నో లక్షల మంది కలలు కనే సివిల్ సర్వీస్‌పై దృష్టిపెట్టాడు. మొదటి ప్రయత్నంలోనే ఐపీఎస్‌కు ఎంపికయ్యూడు. తద్వారా తల్లిదండ్రులతో పాటు తండాకు పేరుప్రఖ్యాతులు తీసుకొచ్చాడు. ప్రస్తుతం కేరళ రాష్ట్రంలో ఐజీ స్థాయిలో పనిచేస్తున్నాడు.

 

ఉన్నత చదువుల ద్వారా వ్యక్తికి గుర్తింపు రావడమే కాకుండా.. జన్మనిచ్చిన తల్లిదండ్రులు, పెరిగిన ప్రాంతానికి గుర్తింపు లభిస్తుందనేది అందరికీ తెలిసిందే. ఈ విషయూన్ని చిన్నతనంలోనే ఆ వ్యక్తి గుర్తించారు. ఇంకేం.. చదువులో ఎక్కడా వెనుకబడలేదు. ఇంటర్మీడియట్ వరకు విద్యాభ్యాసమంతా ప్రభుత్వ పాఠశాలల్లోనే కొనసాగినా ప్రతిష్టాత్మక కాన్పూర్ ఐఐటీలో బీటెక్ సీటు సాధించాడు. ఆ తర్వాత ఎంబీఏ పూర్తి చేసినప్పటికీ సివిల్స్‌పై మక్కువతో మొదటి ప్రయత్నంలోనే ఐపీఎస్ సాధించాడు. ఇవన్నీ ఏదో నగరం, పట్టణ ప్రాంతానికి చెందిన వ్యక్తి వివరాలు కాదు... డోర్నకల్ నియోజకవర్గం ఉయ్యూలవాడ గ్రామపంచాయతీ పరిధిలోని చాప్లాతండాకు చెందిన గుగులోతు లక్ష్మణ్ స్ఫూర్తిదాయక విశేషాలివి.  - డోర్నకల్

 

చదువులో ఫస్ట్ లక్ష్మణ్
లక్ష్మణ్ చిన్ననాటి నుండే చదువుల్లో విశేషంగా రాణించేవాడు. ఒకటో తరగతి నుండి 5వ తరగతి వరకు డోర్నకల్‌లోని ప్రభుత్వ పాఠశాలలో చదివిన లక్ష్మణ్ ఆరు నుండి పదో తరగతి వరకు కల్లూరులోని ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలలో, ఇంటర్ నాగార్జునసాగర్‌లోని ప్రభుత్వ రెసిడెన్షియల్ కళాశాలలో పూర్తి చేశారు. ఆ తర్వాత  బీటెక్(కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్) కాన్పూర్ ఐఐటీలో, ఉస్మానియా యునివర్సిటీలో ఎంబీఏ చదివారు. అరుుతే, సివిల్స్‌కు ఎంపికై ఉద్యోగంలో చేరిన తర్వాత కూడా లక్ష్మణ్ చదువు కొనసాగించారు. ప్రతిష్టాత్మక బెంగళూరులోని ఐఐఎంలో ఎంబీఏ పీజీపీఎం చదివిన ఆయన పబ్లిక్ సర్వీస్‌కు చెందిన ఇంటర్నేషనల్ పబ్లిక్ పాలసీ కోర్సును అమెరికాలోని మోడల్ విత్ మాక్స్‌వెల్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ పాలసీ, సైరాకూర్ యునివర్సిటీలో పూర్తి చేశారు.


కుటుంబమంతా విద్యావంతులే...
గుగులోత్ గోల్యానాయక్, సాలమ్మ సంతానమంతా విద్యావంతులే. ఎలాంటి వసతులు లేని చాప్లాతండాలో వ్యవసాయం చేసుకుంటున్న గోల్యానాయక్ తన పిల్లలను పట్టుదలతో చదివించగా అందరూ ప్రయోజకులయ్యారు. గోల్యానాయక్‌కు ముగ్గురు కుమార్తెలు, ఇద్దరు కుమారులు. పెద్ద కుమార్తె రంగమ్మ ఏడో తరగతి వరకు చదవగా అదే తండాకు చెందిన పాండునాయక్‌తో వివాహం జరిగింది. రంగమ్మ గతంలో ఉయ్యాలవాడ సర్పంచ్‌గా, డోర్నకల్ ఎంపీటీసీ సభ్యురాలిగా పనిచేయగా, ప్రస్తుతం డోర్నకల్ పీఏసీఎస్ డెరైక్టర్‌గా పనిచేస్తున్నారు. రెండో కుమార్తె కొర్ర చుక్కమ్మ హైదరాబాద్‌లో ఎల్‌ఐసీ అధికారిగా, మూడో కుమార్తె భూక్యా సత్యమ్మ ట్రాన్స్‌కో డీఈగా పని చేస్తున్నారు. నాలుగో సంతానమైన లక్ష్మణ్ ఐపీఎస్‌కు ఎంపిక కాగా, చిన్నకుమారుడు రమేష్ అమెరికాలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పని చేస్తున్నారు.



డోర్నకల్ మండలం ఉయ్యలవాడ గ్రామపంచాయతీ పరిధిలోని చాప్లాతండాకు చెందిన గుగులోత్ గోల్యానాయక్, సాలమ్మకు ఐదుగురు సంతానం. వీరిలో నాలుగో సంతానం, కుమారుల్లో మొదటి వాడైన లక్ష్మణ్ ప్రస్తుతం కేరళ రాష్ట్రంలో ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్(ఐజీపీ)గా విధులు నిర్వహిస్తున్నారు. 19ఏళ్ల క్రితం 1997లో సివిల్స్ రాసిన ఆయన మొదటి ప్రయత్నంలోనే ఐపీఎస్‌కు ఎంపిక కాగా, కేరళ కేడర్‌కు నియమించారు. కేరళ రాష్ట్రంలో మంచి గుర్తింపు పొందిన లక్ష్మణ్ పోలీస్ శాఖలో వివిధ స్థాయిలో పనిచేసి ప్రస్తుతం ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్(ఐజీపీ) స్థాయిలో.. ఆ రాష్ట్ర ప్రభుత్వ సంస్థ అయిన ట్రావెన్‌కోర్ సిమెంట్స్ లిమిటెడ్(టీసీఎల్) ఎండీగా పని చేస్తున్నారు. లక్ష్మణ్ తల్లిదండ్రులు గోల్యానాయక్, సాలమ్మతోపాటు పెద్ద సోదరి బానోత్ రంగమ్మ, బావ పాండూనాయక్ ప్రస్తుతం చాప్లాతండాలోనే ఉంటున్నారు. తీరిక వేళల్లో చాప్లాతండాకు వచ్చి తల్లిదండ్రులు, తండావాసులను కలిసే లక్ష్మణ్... మాజీ పోలీసు అధికారి డీటీ.నాయక్ కుమార్తె, వైద్యురాలు కవితను వివాహం చేసుకున్నారు. వీరికి ఒక కుమారుడు ఉన్నారు.

 

ఇప్పటి వరకు పనిచేసిన హోదాలు
{పస్తుతం కేరళ రాష్ట్రంలో ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్(ఐజీపీ) హోదాలో ట్రావెన్‌కోర్ సిమెంట్స్ లిమిటెడ్(టీసీఎల్) మేనేజింగ్ డెరైక్టర్‌గా పని చేస్తున్న గుగులోతు లక్ష్మణ్ గతంలో అనేక హోదాల్లో సమర్థవంతంగా విధులు నిర్వర్తించారు. వాటి వివరాలు...


అలెప్పుజా, అలువా, మలప్పురం, కోజికోడ్‌లో ఏఎఎస్పీగా..
మలప్పురం జిల్లాలో జారుుంట్ ఎస్పీగా..
{తివేంద్రం జిల్లాలో రూరల్ ఎస్పీ(లా అండ్ ఆర్డర్)గా..
{తివేంద్రం ఎస్‌ఏపీ బెటాలియన్ కమాండెంట్‌గా..
{తివేంద్రంలోని కేరళ పోలీసు కంప్యూటర్స్ డిపార్ట్‌మెంట్ హెడ్‌గా..
కేరళ పోలీసు టెలీ కమ్యునికేషన్స్ ఇన్‌చార్జి హెడ్‌గా..
తిరువనంతపురంలోని రాష్ట్ర పోలీసు హెడ్ క్వార్టర్స్‌లో ఏఐజీ(అడ్మినిస్టేషన్)గా..
హైదరాబాద్ బీసీఆర్(డీఆర్‌సీ), అడ్మినిస్ట్రేషన్, ఎస్టేట్, హెచ్‌ఆర్(ఐఆర్), డీఐఎస్(డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఇన్వెస్టర్ సర్వీసెస్) అండ్ సెక్యూరిటీ ఎట్ బీఎస్‌ఈ హెడ్‌గా..
బీఎస్‌ఈ, ఎస్‌ఎంఈ సీఈఓగా..
తిరువనంతపురంలోని మత్స్య ఫెడ్ మేనేజింగ్ డెరైక్టర్‌గా..
కొచ్చిలోని కౌన్సిల్ ఫర్ ఫుడ్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్(సీఎఫ్‌ఆర్‌డీ) సీఈఓగా..
కేరళ రాష్ట్ర సివిల్ సప్లయిస్ కార్పొరేషన్ సప్లై కో మేనేజింగ్ డెరైక్టర్‌గా..

 

 
చదువును నిర్లక్ష్యం చేయవద్దు.

యువతీ, యువకులు చదువులను నిర్లక్ష్యం చేయవద్దు. చదువుల్లో రాణిస్తే ఏ స్థాయికైనా ఎదగవచ్చు. కష్టపడి చదవడం వల్లే నేను ఈ స్థాయిలో ఉన్నాను. విద్యార్థి దశలో కష్టపడి చదివితే భవిష్యత్ మొత్తం అందంగా ఉంటుందనే విషయూన్ని గుర్తించారు. చదువుకుని ఉన్నత స్థారుుకి ఎదిగిన వారికి సమాజం, కుటుంబం, బంధువుల్లో కూడా మంచి గుర్తింపు లభిస్తుంది. చదువు విలువ తెలుసు కాబట్టే నేను ఐపీఎస్‌కు ఎంపికయ్యూక కూడా పలు కోర్సులు పూర్తి చేశాను .  - గుగులోత్ లక్ష్మణ్, ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, కేరళ

 

 

కేరళ ఐజీగా చాప్లా తండా వాసి
{sావెన్‌కోర్ సిమెంట్స్ లిమిటెడ్ (టీసీఎల్) ఎండీగా విధులు  నిర్వర్తిస్తున్న లక్ష్మణ్  మొదటి నుంచి ప్రభుత్వ  విద్యాసంస్థల్లోనే విద్యాభ్యాసం ఐపీఎస్‌కు ఎంపికయ్యూక కూడాచదువు కొనసాగింపుఐఐఎంలో ఎంబీఏ, అమెరికాలో ఇంటర్నేషనల్ పబ్లిక్ పాలసీ కోర్సు

 

Advertisement
Advertisement