ఏక కాలంలో రుణమాఫీ చేస్తాం | Sakshi
Sakshi News home page

ఏక కాలంలో రుణమాఫీ చేస్తాం

Published Thu, May 25 2017 5:14 AM

ఏక కాలంలో రుణమాఫీ చేస్తాం - Sakshi

టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
 
సాక్షి, సూర్యాపేట: ‘ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విస్మ రించాయి. నాలుగుసార్లు రుణమాఫీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం రైతులకు వడ్డీ కూడా ఇవ్వ లేక పోయింది. 2019లో రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తుంది. తమ పార్టీ అధి కారంలోకి రాగానే రూ.2 లక్షల లోపు రైతుల రుణాలను ఏక కాలంలో మాఫీ చేస్తాం’అని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నా రు. సూర్యాపేట జిల్లా కాంగ్రెస్‌ కార్యకర్తల సమావేశం జిల్లా కేంద్రంలో బుధ వారం జరిగింది.  ఉత్తమ్‌ మాట్లాడుతూ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే క్వింటాల్‌ ధాన్యా నికి రూ. 2 వేలు, మిర్చి క్వింటాల్‌కు రూ. 12 వేల మద్దతుధరతో ప్రభుత్వం కొను గోలు చేస్తుందని ప్రకటించారు.

వృద్ధులు, వికలాం గులు, వితంతువుల పింఛన్లను పెంచుతా మని చెప్పారు. నిరుద్యోగులకు నెలకు రూ. 3 వేల నిరుద్యోగ భృతి అందజేస్తామని చెప్పారు.  ఏఐసీసీ కార్యదర్శి రామచంద్ర కుంతియా మాటా ్లడుతూ ఇటీవల జరిగిన ఎన్నికల్లో బీజేపీ డబ్బులతో ఓట్లువేయిం చుకుందని విమర్శిం చారు. ఉత్తమ్‌ సారథ్యం లోనే రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతాయని, తెలంగాణ ఇచ్చిన సోనియా రుణం తీర్చుకునేందుకు ఇక్కడి ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు.  

Advertisement
Advertisement