
'తెలుగు జాతి సిగ్గుపడేలా వ్యవహరిస్తున్నారు'
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు తెలుగు జాతా మొత్తం సిగ్గు పడేలా ఉందని తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విమర్శించారు.
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు తెలుగు జాతా మొత్తం సిగ్గు పడేలా ఉందని తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విమర్శించారు. ఓటుకు నోటు కేసులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన మంత్రులు తీరు అపహాస్యం కల్గించడమే కాకుండా అసహ్యాన్ని కూడా కలిగిస్తుందని ఎద్దేవా చేశారు. ఏపీ మంత్రులకు త్వరగా చంద్రబాబును అరెస్ట్ చేయించాలనే కోరిక ఉందని తుమ్మల పేర్కొన్నారు. ఓటుకు కోట్లు కేసులో అసలు దొంగ ఎవరో ప్రపంచానికి తెలిసిపోయిందని.. దానిపై విచారణ సాగుతుందన్నారు.
గవర్నర్ చేతులు మీదుగా ప్రమాణ స్వీకారం చేసిన మంత్రులే.. ఆయనను గంగిరెద్దుతో పోల్చడం ఎంతవరకూ సమంజసమని ప్రశ్నించారు. కేసీఆర్ ను అర్థరాత్రి వెళ్లి కలిసిన వారే.. ఇప్పుడు తమను టీఆర్ఎస్ ప్రలోభ పెడుతుందంటూ ఫిర్యాదుల ఇస్తున్నారని తుమ్మల మండిపడ్డారు.