
తెలంగాణ ఇవ్వమని చెప్పిన మొదటి పార్టీ టీడీపీ: చంద్రబాబు
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఇవ్వమని చెప్పిన మొదటి పార్టీ టీడీపీయేనని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు.
మహబూబ్నగర్: తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఇవ్వమని చెప్పిన మొదటి పార్టీ టీడీపీయేనని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు. ఈ సాయంత్రం ఇక్కడ జరుగుతున్న టీడీపీ బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ఎన్ని ఒత్తిడులు వచ్చినా తెలంగాణకు మద్దతు ఇచ్చామన్నారు. ఇరుప్రాంతాలకు ఆమోదయోగ్యమైన న్యాయం చేయాలని కోరినట్లు తెలిపారు. పార్టీలు మారిన నేతలను విమర్శించారు. నాయకులు పోయినా పరవాలేదు వందల మంది కార్యకర్తలను తయారు చేస్తామని ధీమా వ్యక్తం చేశారు.
టీడీపీ చాలా సంక్షోభాలు చవిచూసిందన్నారు. ప్రజల పక్షాన నిలబడి రాజీలేని పోరాటాలు చేయమని కార్యకర్తలకు పిలుపు ఇచ్చారు. అందరికీ న్యాయం చేయాలన్నది టీడీపీ ఉద్దేశం అని చెప్పారు. సామాజిక న్యాయానికి టీడీపీ కట్టుబడి ఉందన్నారు. మాదిగలకు రిజర్వేషన్లు కల్పించినట్లు చెప్పారు. టీడీపీలో మాదిగలకు మంచి అవకాశం ఇచ్చామన్నారు.