బోరు రీచార్జి గుంతలు అభినందనీయం | Sakshi
Sakshi News home page

బోరు రీచార్జి గుంతలు అభినందనీయం

Published Sat, May 28 2016 2:54 AM

బోరు రీచార్జి గుంతలు అభినందనీయం

►  కలెక్టర్ నీతూప్రసాద్
భూగర్భ జలాల  పెంపునకు కృషి చేయూలి
నాబార్డు వాటర్ షెడ్డ్   పనులు పరిశీలన

 
 
హుస్నాబాద్‌రూరల్: వర్షపు నీరు వృథా పోకుండా భూమిలోకి మళ్లించి భూగర్భజలాల పెంపునకు కృషి చేయూలని కలెక్టర్ నీతూప్రసాద్ కోరారు. హుస్నాబాద్ మండలం అక్కన్నపేట పంచాయతీ పరిధిలోని నాబార్డు సహకారంతో సతతహరిత, సహాయ స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో చేపట్టిన వాటర్‌షెడ్డు పథకం పనులను శుక్రవారం పరిశీలించారు. గొల్లకుంటలో సహాయ ఎన్జీవో ఆధ్వర్యంలో చేపడుతున్న బోరువెల్ రీచార్జి గుంతల గురించి నాబార్డు ఏజీఎం రవిబాబు కలెక్టర్‌కు వివరించారు.

రైతు శ్రీనివాస్‌ను మాట్లాడుతూ బోరు రీచార్జి గుంత తవ్వడం ద్వారా వర్షంపడ్డ తర్వాత అదనంగా 20 నిమిషాలు నీళ్లు పోసిందని చెప్పారు. వ్యవసాయభూముల్లో ఉపాధిహామీ పథకం ద్వారా నీటికుంటలు, చెక్‌డ్యామ్‌లు నిర్మించుకోవాలని రైతులకు సూచించారు. నీటికుంటల్లో నీరు ఉంటే సమీపంలోని అరకిలోమీటర్ వరకు భూమిలో తేమ ఉంటుందని తెలిపారు. జిల్లాలో 3 వేల వరకు నీటికుంటలు మంజూరు చేసినట్లు చెప్పారు.


 పత్తికి ప్రత్యామ్నాయం సాగు చేయూలి
 పత్తి పంటలు కాకుండా ప్రత్యామ్నాయంగా కూరగాయలు, మొక్కజొన్న, సోయూబీన్ సాగు చేసేలా చూడాలని ఎన్జీవోలను కోరారు. ప్రభుత్వం సబ్సిడీపై అందించే విత్తనాల గురించి వివరించాలన్నారు. జెడ్పీ వైస్‌చైర్మన్ రాయిరెడ్డి రాజిరెడ్డి మాట్లాడుతూ హుస్నాబాద్ మెట్ట ప్రాంతమని, 700 ఫీట్ల వరకు బోర్లు వేసిన చుక్క నీరు రావడం లేదని, ఈ ప్రాంత అభివృద్ధికి కలెక్టర్ ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. ఎంపీపీ భూక్య మంగ మాట్లాడుతు అక్కన్నపేటను మండలం చేయాలని కోరారు. అనంతరం రూ.25లక్షల రుణమంజూరు పత్రాలు పంపిణీ చేశారు.

సర్పంచ్ జాగిరి వసంత, టీజీబీ ఆర్‌ఎం రవీందర్‌రెడ్డి, పశుసంవర్ధకశాఖ డీడీ ప్రభాకర్, ఏడీ వెంకటేశ్వర్లు, ఎంపీడీవో జి.రాంరెడ్డి,తహసీల్దార్ టి.వాణి, వ్యవసాయశాఖ ఏడీఏ మహేశ్, పశువైద్యులు విజయ్‌భార్గవ్, ఏవో శ్రీనివాస్, ఎంపీటీసీ బండి సమ్మయ్య, వాటర్‌షెడ్డు పథకం చైర్మన్ సూరం సమ్మిరెడ్డి, కట్కూర్ సర్పంచ్ రాంచంద్రం, భీమదేవరపల్లి వైస్ ఎంపీపీ మనోహర, సహాయ ఎన్‌జీవో సీఈవో రాజ్‌కమాల్‌రెడ్డి,జనవికాస ఎన్ జీవో అధ్యక్ష, కార్యదర్శులు దిలీప్‌రావు, సంపత్, మాజీ సర్పంచ్, ఎంపీటీసీలు కర్ణకంటి శ్రీశైలం, కంది రాంరెడ్డి పాల్గొన్నారు.

Advertisement
Advertisement