జగిత్యాల: పేరుకే పంచాయతీలు..! | Sakshi
Sakshi News home page

జగిత్యాల: పేరుకే పంచాయతీలు..!

Published Fri, Nov 30 2018 3:02 PM

Officers Negligence About Panchayti Develpoment - Sakshi

సాక్షి, సారంగాపూర్‌(జగిత్యాల): నిధులు లేక పంచాయతీలు నీరసించిపోతున్నాయి. తండాల నుంచి పంచాయతీలుగా మారినా.. అభివృద్ధి మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నచందంగా మారింది. పంచాయతీలుగా గుర్తించి ఆర్నెళ్లయినా.. ఇప్పటివరకు ఒక్క అభివృద్ధి పని కూడా జరగలేదంటే అతిశయోక్తికాదు. పంచాయతీల్లో పారిశుధ్యం పడకేసింది. ప్రత్యేక అధికారులకు పాలనపగ్గాలు అందించడం.. అదనపు బాధ్యతలతో వారు సరిగా విధులు నిర్వర్తించకపోవడంతో గ్రామాల్లో పరిస్థితి రోజురోజుకూ దిగజారిపోతోంది. 500 జనాభా దాటిన తండాలను చాయతీలుగా చేస్తామని 2014 ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు  ప్రభుత్వం గ్రామపంచాయతీలుగా ఏర్పాటు చేసింది. కొన్నిచోట్ల ప్రస్తుతం ఉన్న పంచాయతీలు గిరిజన తండాలకు, గిరిజనేతర శివారు గ్రామాలకు దూరంగా ఉండి, తక్కువ జనాభా కలిగి ఉన్నా అట్టి తండాలను, శివారు గ్రామాలను ప్రభుత్వం గ్రామపంచాయతీలుగా ప్రకటించి, రాష్ట్ర అవతరణ రోజైన జూన్‌ రెండు నుంచి తండాల్లో ప్రత్యేక పంచాయతీల పాలన ఆరంభించింది.

పంచాయతీలు 21
జిల్లాలో మొత్తం 380 గ్రామపంచాయతీలు ఉన్నాయి. జూన్‌ 2న జిల్లాలో గిరిజన, గిరజనేతర జనాభా ప్రాతిపదికన కొత్తగా 60 గ్రామపంచాయతీలను ఏర్పాటుచేశారు. గతంలోనే రాయికల్‌ మండలం జగన్నాథపూర్‌ గిరిజన గ్రామపంచాయతీగా ఉండగా.. కొత్తగా 20 తండాలను గ్రామపంచాయతీలుగా ప్రకటించగా..ఇక్కడ 100 శాతం గిరిజనులే ఉన్నారు. మండలాల వారీగా గిరిజన గ్రామపంచాయతీలు సారంగాపూర్‌ మండలంలో భీంరెడ్డిగూడెం, ధర్మనాయక్‌తండా, మ్యాడారం తండా, లచ్చనాయక్‌తండా,  నాయికపుగూడెం బీర్‌పూర్‌ మండలంలో చిన్నకొల్వాయి, చిత్రవేణిగూడెం, కందెనకుంట, రాయికల్‌ మండలం అలియనాయక్‌తండా, జగన్నాథపూర్,  కైరిగూడెం, మంత్యనాయక్‌తండా, లొక్యనాయక్‌తండా, వాల్మీకితండా, మల్లాపూర్‌ మండలంలో ఓబులాపూర్‌ తండా, వాల్గొండతం డా, మెట్‌పల్లి మండలంలో ఏఎస్‌ఆర్‌ తండా, కేసీఆర్‌ తండా, పటిమిడి తండా, ఇబ్రహీంపట్నంలో తిమ్మాపూర్‌ తండా, కథలాపూర్‌లో రాజారంతండాలు  కొడిమ్యాల మండలంలో గంగారాంతండా గిరిజన గ్రామపంచాయతీలుగా ఏర్పాటు చేశారు. 

నెలలు గడుస్తున్నా అభివృద్ధి లేదు
గ్రామపంచాయతీలు ఏర్పాటు జరిగినా తండా పంచాయతీలకు 14వ ఆర్థిక సంఘం నిధులు మినహాయించి ప్రభుత్వం నుంచి ఇతర అభివృద్ధి పనులకు ఒక్క రూపాయి కూడా విడుదల కాలే దు. దీంతో పంచాయతీల ఏర్పాటు ద్వారా పెద్దగా ఒరిగిన  ప్రయోజనం ఏమిలేదని గిరిజనులు పేర్కొంటున్నారు. జూన్‌ 2న పంచాయతీలను ఏర్పాటు చేసిన సమయంలో పంచాయతీ కార్యాలయాల కోసం తాత్కాలికంగా అందుబాటులో ఉన్న కమ్యూనిటీ భవనాలు, పాఠశాల భవనాలు, కొన్ని గ్రామాల్లో ఇళ్లను అద్దెకు తీసుకుని పంచా యతీ కార్యాలయాలను ప్రారంభించారు. పంచా యతీలు ఏర్పాటు జరిగినా, ఇప్పటి వరకు ఆయా పంచాయతీ కార్యాలయాల్లో సరిౖయెన ఫర్నిచర్‌ కూడా అందుబాటులో లేదు. 

కొత్తగా నిధులు లేవు
గ్రామపంచాయతీలకు కేంద్రం నుంచి జనాభా ప్రాతిపదికన వచ్చిన 14వ ఆర్థిక సంఘం నిధులను జనాభా నిష్పత్తి ప్రకారం విభజించి ఆయా గ్రామపంచాయతీల ఖాతాల్లో పంచాయతీ ప్రత్యేకాధికారి, ఇన్‌చార్జి కార్యదర్శి పేరును జమ చేశారు. ఈ నిధులను తండాలోని వీధిదీపాల ఏర్పా టు, బావుల్లో క్లోరినేషన్‌ నిర్వహించడంతోపాటు, మురికి కాల్వలను శుభ్రం చేయడానికి వినియోగించారు. ఇతరనిధులు మంజూరు కాకపోవడంతో గ్రామాల్లో కొత్తగా ఎలాంటి అభివృద్ధి పనులూ చేపట్టలేదు. 


అధికారుల హాజరు చుట్టచూపే
ప్రత్యేకాధికారులు వారికి కేటాయించిన గ్రామాలకు ఎప్పుడో ఒకసారి వచ్చి వెళ్తున్నారే తప్ప, గిరి జనులతో ఎలాంటి ప్రత్యేక సమావేశాలు జరప డం లేదని సమాచారం. చుట్టపుచూపుగా గ్రామాలకు వస్తున్నారని, తండాల్లోని సమస్యలపై చర్చలు నిర్వహించడం లేదని పేర్కొంటున్నారు. 

Advertisement
Advertisement