టీ కాంగ్రెస్ నేతలకు కేసీఆర్ క్లాస్ ! | Sakshi
Sakshi News home page

టీ కాంగ్రెస్ నేతలకు కేసీఆర్ క్లాస్ !

Published Thu, Jul 31 2014 1:54 AM

టీ కాంగ్రెస్ నేతలకు కేసీఆర్ క్లాస్ ! - Sakshi

హైదరాబాద్: ముఖ్యమంత్రి సహాయనిధి (సీఎంఆర్‌ఎఫ్)కి సంబంధించిన విజ్ఞప్తుల కోసం సీఎం కేసీఆర్‌ను కలిసేందుకు వచ్చిన కొందరు తెలంగాణ కాంగ్రెస్ నాయకులకు వింత పరిస్థితి ఎదురైంది. ముఖ్యమంత్రిగా తనపై, అలాగే ప్రభుత్వంపై కాంగ్రెస్ ముఖ్య నేతలు చేస్తున్న విమర్శలను కేసీఆర్ ఎండగట్టి వారిని నిలదీసినట్లు తెలిసింది. ముఖ్యంగా టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, సీఎల్‌పీ నేత జానారె డ్డి చేస్తున్న విమర్శలను ఆయన ప్రధానంగా ప్రస్తావించినట్లు సమాచారం.

బుధవారం సచివాలయంలో సీఎంను కలుసుకునేందుకు తెలంగాణ ఎమ్మెల్సీలు ప్రభాకరరావు, ఎం.రంగారెడ్డి, ఫారుఖ్‌హుస్సేన్, మాజీ ఎంపీ అంజన్‌కుమార్ యాదవ్ వచ్చారు. ఎమ్మెల్సీలు సీఎంఆర్‌ఎఫ్ నిధుల మంజూరు గురించి విజ్ఞప్తి చేయగా, అంజన్‌కుమార్ తన కుమార్తె వివాహానికి హాజరు కావాల్సిందిగా సీఎంను ఆహ్వానించారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ఇక్కడి ప్రజలు, విద్యార్థుల కోసం కాకుండా ఎవరికోసం చర్యలు తీసుకుంటుంన్నదని సీఎం ప్రశ్నించడంతో కాంగ్రెస్ నాయకులంతా అవాక్కయ్యారు.    
 

Advertisement
Advertisement