తెలంగాణలో 210 కోట్ల మొక్కలు నాటండి: కేసీఆర్ | KCR asks to plant 210 trees in telangana | Sakshi
Sakshi News home page

తెలంగాణలో 210 కోట్ల మొక్కలు నాటండి: కేసీఆర్

Jun 27 2014 8:18 PM | Updated on Oct 4 2018 6:10 PM

తెలంగాణలో 210 కోట్ల మొక్కలు నాటండి: కేసీఆర్ - Sakshi

తెలంగాణలో 210 కోట్ల మొక్కలు నాటండి: కేసీఆర్

తెలంగాణ రాష్ట్ర అటవీ శాఖ అధికారులతో ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర అటవీ శాఖ అధికారులతో ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో తెలంగాణలో పర్యావరణంపై ప్రత్యేక దృష్టిని పెట్టాలని అధికారులకు కేసీఆర్ సూచించారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా  తెలంగాణ అంతటా భారీగా మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టాలని అధికారులకు కేసీఆర్ తెలిపారు. 
 
తెలంగాణ రాష్ట్రంలో 210 కోట్ల మొక్కలు నాటాలని అటవీశాఖా అధికారులు సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.  హెచ్ఎండీఏ  పరిధిలో 10 కోట్ల మొక్కలు నాటాలని కేసీఆర్ తెలిపారు. అలాగే ప్రతి అసెంబ్లీ నియోజవర్గానికి 40 లక్షల మొక్కలు నాటి తెలంగాణను హరిత తెలంగాణ తీర్చిదిద్దాలని అధికారులకు కేసీఆర్ తెలిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement