న్యాయం చేయండి | Sakshi
Sakshi News home page

న్యాయం చేయండి

Published Sat, Feb 13 2016 4:05 AM

న్యాయం చేయండి

ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ వర్తింపజేయూలి
ఇసుకలారీలు అడ్డుకున్న
 సంకెపల్లి గ్రామస్తులు

 
 వేములవాడ రూరల్ :  తమకు న్యాయం జరిగే వరకు గ్రామ శివారు నుంచి ఇసుకను తరలించేది లేదని సంకెపల్లి గ్రామస్తులు శుక్రవారం ఆందోళనకు దిగారు. మధ్యమానేరు నిర్మాణంతో సంకెపల్లి గ్రామస్తుల వ్యవసాయ భూములు ముంపునకు గురవుతుండగా.. కొన్ని భూములకు మాత్రమే పరిహారం వచ్చిందని, మిగతా భూములకు సైతం త్వరగా ఇవ్వాలని కోరారు. దీనిపై అధికారులకు విన్నవించినా పట్టించుకోవడం లేదన్నారు. ఎమ్మెల్యే రమేశ్‌బాబును గురువారం కలిసినా ఫలితం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇసుక తోడుతున్న వాహనాల ముందు బైఠాయించారు. ఈవిషయం తెలుసుకున్న పట్టణ సీఐ శ్రీనివాస్, తహశీల్దార్ రమేశ్, ఎస్సై సైదారావు సిబ్బందితో అక్కడికి చేరుకుని మాట్లాడిన గ్రామస్తులు పట్టించుకోలేదు. కలెక్టర్, ఆర్డీవోల నుంచి హామి వచ్చే వరకు తాము ఈ ఆందోళనను విరమించేది లేదని భీష్మించుకు కూర్చున్నారు. రెండు రోజుల్లో సమస్య పరిష్కరిస్తామని సిరిసిల్ల ఆర్డీవో బిక్షానాయక్ హామీ ఇవ్వడంతో వారు శాంతించారు
.  
 నిర్వాసితుల డిమాండ్లు
గ్రామస్తులందరికీ ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ వర్తింపజేయూలి.  
 పూర్తి స్థాయి ముంపు గ్రామంగా ప్రకటించి, పరిహారం అందించాకే ఇసుకను తీసుకువెళ్లాలి.

Advertisement
Advertisement