సీఎం కేసీఆర్‌ రైతు వ్యతిరేకి | Sakshi
Sakshi News home page

సీఎం కేసీఆర్‌ రైతు వ్యతిరేకి

Published Fri, May 26 2017 1:37 AM

సీఎం కేసీఆర్‌ రైతు వ్యతిరేకి - Sakshi

- ఆత్మహత్యల్లో తెలంగాణే నంబర్‌ వన్‌
- పీసీసీ చీఫ్‌  ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
 
సాక్షి, కామారెడ్డి: సీఎం కేసీఆర్‌ రైతు వ్యతి రేకి అని పీసీసీ అధ్యక్షుడు కెప్టెన్‌ ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి ఆరోపించారు. మద్దతు ధర అడిగిన రైతులకు బేడీలు వేయించిన ఘనత ఆయనదన్నారు. గురువారం కామారెడ్డిలో నిర్వహించిన జిల్లా కాంగ్రెస్‌ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పంటలకు గిట్టుబాటు ధరలు లభించని పరిస్థితుల్లో పక్క రాష్ట్రాల్లోని ప్రభుత్వాలు రైతులకు బోనస్‌ ఇస్తుంటే సీఎం కేసీఆర్‌ మాత్రం ఏ చర్యలూ తీసుకోవడం లేద న్నారు. పంట రుణాలను విడతల వారీగా మాఫీ చేసి వడ్డీ ఎగ్గొట్టారన్నారు. మిర్చి, కందులు, పసుపు, సోయా తదితర పంట లకు సరైన ధరలు రాక రైతులు నష్టపో తున్నా కేసీఆర్‌ స్పందించడం లేదన్నారు. వ్యవసాయ ఉత్పత్తులకు రూ. వెయ్యి కోట్లు మార్కెట్‌ ఇంటర్‌వెన్షన్‌ ఫండ్‌ కింద పెట్టి ఆదుకోవాలని శాసనసభలో తామంతా ప్రభుత్వానికి సూచించినా పట్టించుకోలేద న్నారు. రైతుల ఆత్మ హత్యల్లోనూ తెలంగాణ నంబర్‌వన్‌గా ఉంద న్నారు. స్వామినాథన్‌ కమిషన్‌ సిఫారసులను అమలు చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన ప్రధాని మోదీ.. ఆ మాటే మరిచిపోయారన్నారు.
 
ప్రజాగర్జనను విజయవంతం చేయండి
జూన్‌ 1న సంగారెడ్డిలో నిర్వహించే ప్రజా గర్జనలో ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ పాల్గొంటారని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. ఆ సభను విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులను కోరారు. 
 
రాహుల్‌ పర్యటన ఇలా....
ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ జూన్‌ 1న మధ్యాహ్నం 3.30 గంటలకు బేగంపేట ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారని, అక్కడి నుంచి సంగారెడ్డికి బయలుదేరతారని, సాయంత్రం 5.30 గంటలకు చేరుకుంటారని ఉత్తమ్‌ తెలిపారు. గంటపాటు వివిధ వర్గాలతో సమావేశం అవుతారన్నారు. అనంతరం 6.30 గంటల నుంచి 8.30 గంటల వరకు సభలో పాల్గొంటారని తెలిపారు.

Advertisement
Advertisement