
తెలంగాణ వ్యాప్తంగా నిలిచిన 108 సేవలు
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 108 సేవలకు శనివారం అంతరాయం ఏర్పడింది. డీజిల్ కొరత కారణంగా 108 వాహనాలు ఎక్కడివక్కడే నిలిచిపోయాయి.
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 108 సేవలకు శనివారం అంతరాయం ఏర్పడింది. డీజిల్ కొరత కారణంగా 108 వాహనాలు ఎక్కడివక్కడే నిలిచిపోయాయి. జీవీకే- ఈఎంఆర్‌ఐ ఆధ్వర్యంలో 108 సేవలు నడుస్తున్న విషయం తెలిసిందే. కాగా తమకు ఆరునెలలుగా వేతనాలు చెల్లించకపోవడంతో దసరా, బక్రీద్ పండుగలను ఎలా జరుపుకోవాలంటూ . తెలంగాణ రాష్ట్ర 108 ఉద్యోగుల సంఘం ముఖ్యమంత్రి కేసీఆర్కు లేఖ రాసిన విషయం తెలిసిందే. సీఎం చొరవ తీసుకుని తక్షణమే తమకు వేతనాలు విడుదలయ్యేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేసింది.