'గ్రామాల్లో సంపద పెరగాలి. పెరిగిన సంపద గ్రామీణ ప్రజలకే చెందాలి'
x
మీరు ఇక్కడ ఉన్నారు: హోం రాష్ట్రీయంకథ

బాబు, లోకేశ్‌ల నుంచి సిఫార్సులు

Sakshi | Updated: January 12, 2017 02:56 (IST)
బాబు, లోకేశ్‌ల నుంచి సిఫార్సులు

 ప్రభుత్వ స్థలాలపై టీడీపీ ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి సంచలన వ్యాఖ్య

నరసన్నపేట: ప్రభుత్వ స్థలాల కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన తనయుడు లోకేశ్‌ నుంచి సిఫార్సులు వస్తున్నాయని శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట నియోజకవర్గ అధికార టీడీపీ ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి సంచలన వ్యాఖ్య చేశారు. నరసన్నపేట పంచాయతీ కార్యాలయంలో బుధవారం జన్మభూమి సభ జరిపారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌ పి.లక్ష్మీనరసింహం పాల్గొన్నారు. ఆయన సమక్షంలోనే ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నరసన్నపేట మండల కేంద్రంలో ప్రభుత్వ స్థలాలు తమకు దక్కేలా చూడాలని కొందరు టీడీపీ నేతలే ఒత్తిడి తెస్తున్నారని, కొందరైతే సీఎం చంద్రబాబు, ఆయన తనయుడు లోకేశ్‌ల నుంచి సిఫార్సులు తీసుకొస్తున్నారని చెప్పారు. అయితే తాను మాత్రం ప్రభుత్వ స్థలాలు అన్యాక్రాంతం కావడాన్ని సహించబోనని స్పష్టం చేశారు.

వ్యాఖ్యలు

Advertisement

Advertisement

Advertisement

EPaper

ఆగిన భూచట్టం!

Sakshi Post

IS operatives who allegedly planned ‘lone-wolf’ attacks held 

IS operatives who allegedly planned ‘lone-wolf’ attacks held

Advertisement

© Copyright Sakshi 2017. All rights reserved. | ABC