గంగూలీ అద్భుతాలు చేయగలడు: బ్రెట్‌లీ | Sakshi
Sakshi News home page

గంగూలీ అద్భుతాలు చేయగలడు: బ్రెట్‌లీ

Published Wed, May 27 2015 12:57 AM

Sourav Ganguly Would do a Great Job as India Coach: Brett Lee

మెల్‌బోర్న్: భారత క్రికెట్ జట్టు కోచ్‌గా సౌరవ్ గంగూలీ ఎంపికైతే అది జట్టుకు ఎంతో మేలు చేస్తుందని ఆస్ట్రేలియా మాజీ పేస్ బౌలర్ బ్రెట్‌లీ అభిప్రాయ పడ్డాడు. అతని అపార అనుభవం ఎంతో ఉపయోగ పడుతుందని లీ వ్యాఖ్యానించాడు. ‘కోచ్‌గా గంగూలీ అద్భుతమైన ఫలితాలు అందించగలడు. మూడు రకాల ఫార్మాట్‌లలో అతనికి ఎంతో పరిజ్ఞానం ఉంది. గతంలో గొప్ప విజయాలు అందించిన అనుభవం కోచ్‌గా కూడా పనికొస్తుందని నా నమ్మకం. కోచ్‌గా అన్నింటినీ సమన్వయం చేసుకోగలగాలి. గంగూలీకి నిజంగా ఆసక్తి ఉంటే అతను ఈ పదవికి తగినవాడు’ అని బ్రెట్‌లీ అన్నాడు.
 

Advertisement
Advertisement