లక్ష్మణ్ చొక్కాపై చెణుకులు | Sakshi
Sakshi News home page

లక్ష్మణ్ చొక్కాపై చెణుకులు

Published Fri, Oct 9 2015 11:09 AM

లక్ష్మణ్ చొక్కాపై చెణుకులు

వర్షం కారణంగా భారత్, దక్షిణాఫ్రికా మ్యాచ్ ఆలస్యమైన సమయంలో టీవీ స్టూడియోలో ఒక దృశ్యం అందరి దృష్టినీ ఆకర్షించింది. అదేదో సీరియస్ మ్యాచ్ విశ్లేషణ గురించి కాదు... వీవీఎస్ లక్ష్మణ్ వేసుకున్న షర్ట్‌పై జరిగిన చర్చ!

కొట్టొచ్చినట్లు కనిపిస్తున్న నీలి రంగుపై పిచ్చుకలు  కూర్చున్నట్లు ముద్రించి ఉన్న చొక్కా అది. సహ కామెంటేటర్లు దానిపై సరదాగా నవ్వుకోవడంతో అది ఆగిపోలేదు. భారత జట్టు ఆటగాళ్లకు కూడా అది కొత్తగా అనిపించినట్లుంది. అల్లరి పనుల్లో ముందుండే హర్భజన్ తెల్ల కాగితంపై ‘లక్ష్మణ్, మీ షర్ట్ మాకెంతో నచ్చింది’ అంటూ రాసి నిలబడ్డాడు. ధోని, కోహ్లి సహా ఆటగాళ్లంతా అతనితో జత కలిసి అద్భుతం అన్నట్లు పోజిచ్చారు. తన అభిమాన ఈడెన్ మైదానంలో లక్ష్మణ్‌ను మాజీ సహచరులు ఒకింత సరదాగా ఇలా ఆట పట్టించారు!

Advertisement
Advertisement