బాలీవుడ్ బంధంపై సెహ్వాగ్ ఏమన్నాడంటే.. | Sakshi
Sakshi News home page

బాలీవుడ్ బంధంపై సెహ్వాగ్ ఏమన్నాడంటే..

Published Fri, Dec 2 2016 6:12 PM

బాలీవుడ్ బంధంపై సెహ్వాగ్ ఏమన్నాడంటే.. - Sakshi

న్యూఢిల్లీ:ఒకటి క్రికెట్..మరొకటి సినిమా. ఈ రెండు ప్రేక్షకులకు అత్యంత వినోదాన్ని అందించేవి అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఆనాటి నుంచి నేటి వరకూ సినిమా-క్రికెట్ బంధం కొనసాగుతూనే వస్తుంది. ఈ రెండు ఫీల్డ్లను వేరు చేసి చూడలేనంతంగా ఆ బంధం పెనవేసుకుని ఉందంటే అతిశయోక్తి కాదేమో.  అయితే భారత మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ మాత్రం బాలీవుడ్తో క్రికెటర్లకు బంధం ఎంతమాత్రం అవసరం లేదంటున్నాడు. అసలు క్రికెటర్లకు బాలీవుడ్తో సంబంధం పెట్టుకోవాల్సిన అవసరం లేదని తెగేసి చెప్పాడు. వేర్వేరు ఫీల్డ్లైన ఆ రెండింటిని ఒక్కటిగా చూడటం సబబు కాదన్నాడు. 'వీరు కే ఫండే' అనే వెబ్ సిరీస్కు గెస్ట్గా వ్యవహరిస్తున్న సెహ్వాగ్.. బాలీవుడ్పై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు.

'అసలు ఆ రెండింటికి ఎటువంటి దగ్గర సంబంధం లేదు. అదే క్రమంలో ఆ రెండు ఒకదానిపై ఒకటి ఆధారపడే పరిస్థితి కూడా లేదు. మరి అటువంటప్పుడు వాటిని ఒక్కటిగా ఎలా చూస్తాం' అని సెహ్వాగ్ ప్రశ్నించాడు. ఇదిలా ఉండగా, ఐపీఎల్ లో కోల్ కతా నైట్ రైడర్స్ జట్టుకు యజమానికిగా బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ ఉండటంపై అడిగిన ప్రశ్నకు సెహ్వాగ్ తనదైన శైలిలో స్పందించాడు. వారి దగ్గర కావాల్సినంత డబ్బులు ఉన్నాయి కాబట్టే జట్లను కొనుగోలు చేయడానికి ప్రధాన కారణమని, అంతకుమించి ఈ రెండు ఫీల్డ్లకు ఎటువంటి బంధం లేదనే వాస్తవాన్ని గ్రహించాలన్నాడు. క్రికెటర్లకు బాలీవుడ్ అవసరం లేదంటూనే, అదే సమయంలో బాలీవుడ్కు క్రికెటర్ల అవసరం లేదని స్పష్టం చేశాడు.

Advertisement
Advertisement