అంతరిక్షం నుంచి మొదటి ఫొటో..! | Sakshi
Sakshi News home page

అంతరిక్షం నుంచి మొదటి ఫొటో..!

Published Sun, Feb 8 2015 8:49 AM

అంతరిక్షం నుంచి మొదటి ఫొటో..!

 సగం నల్లగా.. సగం బూడిద వర్ణంలో ఉన్న ఈ ఫొటో దేనిదబ్బా.. అనుకుంటున్నారా? మన భూగోళమే! రోదసి నుంచి మొట్ట మొదటిసారిగా తీసిన భూమి ఫొటో ఇది. అమెరికా అంతరిక్ష సంస్థ నాసా.. అక్టోబరు 1946లో ప్రయోగించిన ‘వీ2 రాకెట్’కు అమర్చిన కెమెరాలు తీసిన ఫొటోలను కూర్చి.. క్లైడ్ హాలిడే అనే ఇంజనీర్ ఈ ఫొటోను రూపొందించారు. ఫిబ్రవరి 26న లండన్‌లో ‘డ్రివీట్స్ అండ్ బ్లూమ్స్‌బరీ’ సంస్థ వేయనున్న వేలంలో దీనికి రూ.94 వేలు పలుకవచ్చని అంచనా. దీనితో పాటు నాసాకు చెందిన ఇలాంటి అరుదైన 600 ఫొటోలను వేలం వేయనుండగా.. అన్నింటికీ కలిపి రూ. 4.72 కోట్ల వరకు రావచ్చని భావిస్తున్నారు. చంద్రుడిపై నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ అడుగుపెట్టినప్పటి ఫొటోలు, అంతరిక్షం నుంచి బజ్ ఆల్డ్రిన్ తీసుకున్న తొలి సెల్ఫీ, ఇంతవరకూ బయటివారెవరూ చూడనటువంటి అరుదైన ఫొటోలూ వీటిలో ఉన్నాయట.
 

Advertisement
Advertisement