
ఇంటి వద్ద మొత్తం భద్రతా సిబ్బందిని మార్చేసిన బాబు
నోటుకు ఓటు వ్యవహారంలో ఆడియో టేపులు వెలువడ్డ వెంటనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు పలు కీలక నిర్ణయాలకు శ్రీకారం చుట్టారు.
హైదరాబాద్: నోటుకు ఓటు వ్యవహారంలో ఆడియో టేపులు వెలువడ్డ వెంటనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు పలు కీలక నిర్ణయాలకు శ్రీకారం చుట్టారు. ముందుగా తన నివాసం వద్ద భద్రతా ఇబ్బంది మొత్తాన్ని మార్చి వేశారు. కొత్తవారిని నియమించారు.ఇంటి వద్ద భద్రతను పర్యవేక్షణను అడిషనల్ ఎస్పీ స్థాయి అధికారికి అప్పగించారు. అలాగే గ్రేహౌండ్స్, ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్లో కూడా సమూల మార్పులు చేశారు.
తెలంగాణలో ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగాయి. ఈ నేపథ్యంలో ఓటుకు నోటు వ్యవహారంలో టీ టీడీపీ ఉప నేత రేవంత్ రెడ్డి అరెస్ట్ అయ్యారు. అనంతరం ఆ వ్యవహారంలో చంద్రబాబుకు చెందిన గొంతుతో రికార్డు అయిన ఆడియో టేపులు విడుదలయిన సంగతి తెలిసిందే. దాంతో వెంటనే చంద్రబాబు అప్రమత్తమైయ్యారు.