మీరు చౌదరీ.. నేను చౌదరీ అంటూ బురిడీ! | sbi bank manager cheated by unknown person | Sakshi
Sakshi News home page

మీరు చౌదరీ.. నేను చౌదరీ అంటూ బురిడీ!

Mar 1 2017 10:52 PM | Updated on Sep 5 2017 4:56 AM

మీరు చౌదరీ.. నేను చౌదరీ అంటూ బురిడీ!

మీరు చౌదరీ.. నేను చౌదరీ అంటూ బురిడీ!

స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ హైదరాబాద్‌ కాచిగూడ బ్రాంచి మేనేజర్‌ను ఓ వ్యక్తి తన వాక్చాతుర్యంతో మాయమాటలు చెప్పి అతని వద్దనుంచి డబ్బులు తీసుకెళ్లిన సంఘటన కాచిగూడ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో బుధవారం జరిగింది.

కాచిగూడ: స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ హైదరాబాద్‌ కాచిగూడ బ్రాంచి మేనేజర్‌ను ఓ వ్యక్తి తన వాక్చాతుర్యంతో మాయమాటలు చెప్పి అతని వద్దనుంచి డబ్బులు తీసుకెళ్లిన సంఘటన కాచిగూడ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో బుధవారం జరిగింది. ఇన్స్‌పెక్టర్‌ కె.సత్యనారాయణ తెలిపిన వివరాల ప్రకారం...

ఎస్‌బీహెచ్‌ కాచిగూడ మేనేజర్‌గా పనిచేస్తున్న దాసరి అమృతయ్య చౌదరి వద్దకు ఓ గుర్తుతెలియని వ్యక్తి తన పేరు యలమంచలి మహేష్‌ చౌదరి అని చెప్పి పరిచయం చేసుకున్నాడు. మీరు చౌదరీ.. నేను చౌదరీ ఇద్దరం ఒకే వర్గానికి చెందిన వారమని మాయమాటలు చెప్పి మేనేజర్‌తో స్నేహంగా నటించాడు.

తాను హుడా ఆఫీసులో పనిచేస్తున్నానని చెప్పి తనకు వివిధ ప్రాంతాల్లో చాలా ప్రాపర్టీస్‌ ఉన్నాయని చెప్పాడు. గచ్చిబౌలిలో బ్యాంకు వేలం పాటలో తక్కువ ధరకే ఓ ప్లాట్‌ వస్తుందని, ప్రస్తుతం రూ.86వేలు చాలన్‌ కడితే సరిపోతుందని నమ్మబలికి బ్యాంకు మేనేజర్‌ వద్ద రూ.86వేలు తీసుకుని వెళ్లాడు. ప్లాట్‌కు సంబంధించిన పేపర్లను చూపించి నమ్మించాడు. పేపర్లను టెబుల్‌పైన పెట్టి వెళ్లండని బ్యాంక్‌ మేనేజర్‌ చెప్పాడు. బ్యాంకుకు వచ్చిన వ్యక్తి ఎలాంటి డాక్యుమెంట్స్‌ పెట్టకుండానే డబ్బులు తీసుకుని వెళ్లిపోయాడు.

అప్పటి వరకు బిజీగా ఉన్న బ్యాంకు మేనేజర్‌ తన టేబుల్‌పైన ప్లాట్‌కు సంబందించిన డాక్యుమెంట్స్‌ కోసం చూడగా అక్కడ ఏమి లేవు. దీంతో మోసపోయానని గ్రహించిన మేనేజర్‌ దాసరి అమృతయ్య చౌదరి కాచిగూడ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. అడ్మిన్‌ ఎస్‌ఐ యు.శ్రీనివాస్‌రెడ్డి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement