బంతిపూల దండ ఎవరి కోసం? | Sakshi
Sakshi News home page

బంతిపూల దండ ఎవరి కోసం?

Published Sun, Apr 30 2017 12:15 AM

బంతిపూల దండ ఎవరి కోసం? - Sakshi

కుర్రాడి కళ్లు ఎవర్నో చూస్తున్నాయ్‌ కదూ! భ్రమరాంబను చూస్తున్నాడు. పేరులా పిల్ల కూడా మంచి పద్ధతిగా, బంతిపువ్వులా భలే ఉంటుంది. ఇంతకీ కుర్రాడి పేరు చెప్పలేదు కదూ... శివ! రామ్‌గోపాల్‌ వర్మ తీసిన ‘శివ’లో హీరో టైప్‌ కాదు. కాసేపు కృష్ణవంశీ తీసిన ‘నిన్నే పెళ్లాడుతా’లో హీరో, ఇంకాసేపు త్రివిక్రమ్‌ రాసిన ‘మన్మథుడు’లో హీరో టైపు. ఊరెళ్లినప్పుడు డోలు భాజా వాయిస్తున్న భ్రమరాంబను చూస్తాడు. మనసు పడతాడు.

మెడలో బంతిపూల దండ వేసుకుని, ఆ దండ భ్రమరాంబ మెడలో వేయాలని కలలు కంటాడు. మరి, అమ్మాయి మనసులో ఏముంది? మే 19న తెలుస్తుంది. ‘సోగ్గాడే చిన్ని నాయనా’ ఫేమ్‌ కల్యాణ్‌కృష్ణ కురసాల దర్శకత్వంలో అక్కినేని నాగార్జున నిర్మిస్తున్న ‘రారండోయ్‌.. వేడుక చూద్దాం’ ఆ రోజునే విడుదలవుతోంది. ఇందులో శివగా నాగచైతన్య, భ్రమరాంబగా రకుల్‌ప్రీత్‌ సింగ్‌ నటిస్తున్నారు. నిన్నటితో టాకీ పార్ట్‌ కంప్లీట్‌ చేశారు. ఒక్క సాంగ్‌ బ్యాలెన్స్‌. మే 10 నుంచి మున్నార్‌లో మూడు రోజులు ఆ పాట చిత్రీకరించాలని ప్లాన్‌ చేశారు. ఇంతకు ముందు ఎప్పుడూ నటించనటువంటి పాత్రల్లో చైతు, రకుల్‌ కనిపిస్తారని దర్శకుడు చెప్పారు. ఈ చిత్రానికి అనూప్‌ రూబెన్స్‌ సంగీత దర్శకుడు.

Advertisement
Advertisement