
150 సీట్లకుపైగా గెలుస్తాం: వైఎస్ భారతి
సీమాంధ్రలో 150 సీట్లకు పైగా గెలుస్తామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సతీమణి వైఎస్ భారతి ధీమా చేశారు.
పులివెందుల : సీమాంధ్రలో 150 సీట్లకు పైగా గెలుస్తామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సతీమణి వైఎస్ భారతి ధీమా చేశారు. బుధవారం ఆమె పులివెందులలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. వైఎస్ భారతితో పాటు వైఎష్ షర్మిల కూడా ఉన్నారు.
టీడీపీ అసెంబ్లీ స్థానాల్లో సింగిల్ డిజిట్‌కే పరిమితం అవుతుందని..చంద్రబాబుకి ఒక్క ఎంపీ సీటు కూడా రాదని వైఎస్ భారతి చెప్పారు. క్యూలో నిలబడి వైఎస్ భారతి, షర్మిల ఓటేశారు. తాము సామాన్యులమేనని..తమ ఊరి వారితో క్యూలో నిలబడి ఓటేయడం ఆనందంగా ఉందని భారతి తెలిపారు. విశ్వసనీయత ఉంది ఎవరికో..విశ్వసనీయత లేనిది ఎవరికో ప్రజలకు తెలుసన్నారు.