బస్‌ షెల్టర్‌ లేక ప్రయాణికుల అవస్థ | Sakshi
Sakshi News home page

బస్‌ షెల్టర్‌ లేక ప్రయాణికుల అవస్థ

Published Mon, Aug 22 2016 12:34 AM

బస్‌ షెల్టర్‌ లేక ప్రయాణికుల అవస్థ

ఎల్లారెడ్డి: పట్టణంలోని పోలీస్‌ స్టేషన్‌ ప్రాంతంలో బస్‌ షెల్టర్‌ నిర్మాణం చేపట్టాలని స్థానికులు ఎన్నో ఏళ్లుగా విజ్ఞప్తులు చేస్తున్నా ఫలితం లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. బాన్సువాడ, నిజామాబాద్‌ వైపు వెళ్లే ప్రయాణికులు బస్టాండ్‌లో కంటే పోలీస్‌స్టేషన్‌ వద్ద ఉన్న రిక్వెస్ట్‌ స్టాప్‌ నుంచే బస్‌లలో ఎక్కుతుంటారు. రోజూ వందలాది మంది ఎక్కే ఈ స్టాప్‌ వద్ద ఎలాంటి షెల్టర్‌ లేకపోవడంతో ఎండకు, వానకు తడుస్తూ ప్రయాణికులు తీవ్ర అవస్థ పడుతున్నారు. స్థానిక గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో ఈ స్టాప్‌ వద్ద బస్‌ షెల్టర్‌ నిర్మించాలని చాలా రోజులుగా ప్రతిపాదనలు ఉన్నా ఇంతవరకు అది సాధ్యపడలేదు. స్థానిక స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో నిర్మాణం చేపడుతామని పలువురు వాగ్దానాలు చేసినా అవి కార్యరూపం దాల్చడం లేదు. ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రజల ఇబ్బందులను దష్టిలో పెట్టుకుని తక్షణం షెల్టర్‌ నిర్మాణం చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. 
 
ఎంతో ఇబ్బందిగా ఉంది
జొన్నలగడ్డ రాజశేఖర్, స్థానికుడు
రోజూ స్కూళ్లకు, కాలేజ్‌లకు వెళ్లే విద్యార్థులకు ఈ స్టాప్‌ వద్ద షెల్టర్‌ లేకపోవడం చాలా ఇబ్బందిగా మారుతోంది. ఈ ప్రాంతంలో ఎలాంటి చెట్లు కాని, దుకాణాల సముదాయాలు లేకపోవడంతో రోడ్డు పక్కనే విద్యార్థులు నిలబడుతున్నారు. తక్షణం బస్సు షెల్టర్‌ను నిర్మించాలి.
 
ఎండలో,వానలో నిల్చుంటున్నారు
మండ్రు విఠల్‌–స్థానికుడు
బాన్సువాడ వెళ్లాలంటే మా పట్టణంలో ఎవరూ బస్టాండ్‌కు వెళ్లరు. పోలీస్‌స్టేషన్‌ వద్ద ఉన్న స్టాప్‌ నుంచే బస్సులు ఎక్కుతుంటారు. ఇక్కడ ఎలాంటి షెల్టర్‌ లేకపోవడంతో ఎండలో, వానలో నిలబడాల్సి వస్తున్నది. ప్రభుత్వం తరపున లేదా స్వచ్ఛంద సంస్థలు షెల్టర్‌ నిర్మిస్తే బాగుంటుంది.
 
షెల్టర్‌ నిర్మాణానికి కషి
అనూరాధగౌడ్, స్వచ్ఛంద సేవకురాలు 
పట్టణంలోని పోలీస్‌స్టేషన్‌ వద్ద బస్‌ షెల్టర్‌ లేకపోవడంతో ప్రజలు, విద్యార్థులు పడుతున్న ఇబ్బందులు ప్రత్యక్షంగా చూశాను. స్థానిక నేతలు, ప్రజలు సహకరిస్తే షెల్టర్‌ నిర్మాణానికి మా వంతు కషి చేసేందుకు సిద్ధం. దీనితోపాటు సోమార్‌పేట బైపాస్‌ రోడ్డు వద్ద ఉన్న మోడల్‌ స్కూల్‌వద్ద కూడా షెల్టర్‌ను నిర్మించాలి. ఇందుకు స్థానిక ప్రజాప్రతినిధులు సహకరించాలి.
 
20 వైఎల్లార్‌ 106: బస్‌ షెల్టర్‌ లేకపోవడంతో రోడ్డుపై నిల్చున్న ప్రయాణికులు, విద్యార్థులు
20 వైఎల్లార్‌ 107:  అనూరాధాగౌడ్‌
20 వైఎల్లార్‌ 108: రాజశేఖర్‌–స్థానికుడు
20 వైఎల్లార్‌ 109:  విఠల్‌–స్థానికుడు
 

Advertisement
Advertisement