ఖేడ్ లో పశు షెల్టర్ | Sakshi
Sakshi News home page

ఖేడ్ లో పశు షెల్టర్

Published Fri, Apr 29 2016 2:24 AM

ఖేడ్ లో పశు షెల్టర్

నేడు ప్రారంభం
రెండు నెలల పాటు 2వేల పశువులకు వసతి
దక్షిణ భారతదేశంలోనే మొదటిది..
పశు సంవర్ధక శాఖ జేడీ లక్ష్మారెడ్డి

 జోగిపేట: వేసవి కాలంలో పశు సంపదను కాపాడుకునేందుకు పశు సంవరక్షణ కేంద్రం ప్రారంభిస్తున్నట్టు ఆ శాఖ జాయింట్ డెరైక్టర్ డాక్టర్ లక్ష్మారెడ్డి తెలిపారు.  నారాయణఖేడ్ నియోజకవర్గం నల్లవాగు ప్రాంతంలో శుక్రవారం ఈ కేంద్రాన్ని ప్రారంభిస్తున్నామని చెప్పారు. గురువారం విలేకరులతో ఆయన మాట్లాడారు. దక్షిణ భారతదేశంలోనే ఇది మొదటిదన్నారు. సంరక్షణ కేంద్రంలో రెండు నెలల పాటు 2వేల పశువులకు సరిపడా వసతులను కల్పించనున్నామని తెలిపారు. పశువులకు గడ్డి, నీరు, రైతులకు వసతి, ఉచితంగా భోజనం, ఇతర సదుపాయాలతో కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నామన్నారు. ప్రారంభ కార్యక్రమానికి మంత్రులు హరీశ్‌రావు, తలసాని శ్రీనివాస్‌యాదవ్‌లు హాజరవుతున్నారని చెప్పారు.

Advertisement
Advertisement