బనవాసిలో షూటింగ్‌ సందడి | Sakshi
Sakshi News home page

బనవాసిలో షూటింగ్‌ సందడి

Published Mon, May 22 2017 10:53 PM

బనవాసిలో షూటింగ్‌ సందడి

ఎమ్మిగనూరు రూరల్‌: పట్టణం, బనవాసి ఫాం పరిసర ప్రాంతాల్లో సినిమా షూటింగ్‌ సందడి నెలకొంది. ఐడియా క్రియేషన్‌ ప్రొడక‌్షన్‌- 2 పేరున ‘జబర్దస్త్‌ గబ్బర్‌సింగ్‌ ’ సినిమాను ఐదుగురు హీరోలతో నిర్మిస్తున్నారు. బనవాసి ఫాం ప్రాంతాల్లో కొన్ని సీన్లను తెరకెక్కించారు.  సాయంత్రం పట్టణంలో లక్ష్మణ్‌ థియేటర్‌లో చిత్రం యూనిట్‌ సభ్యులు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సినిమా డైరెక్టర్‌ సుజాత బౌర్య మాట్లాడుతూ ఇది తనకు రెండవ సినిమా అని తెలిపారు. మొదటి సినిమా పంచమితో గుర్తింపు వచ్చిందన్నారు.  ఐదుగురు హీరోలతో వినోదం, హర్రర్‌ ఉంటుందని చెప్పారు.  ఇందులో ఐదుగురు హీరోలు చిత్రం శ్రీను, హర్ష, నవీన్, బాలు, శాంతిమహరాజ్‌ నటిస్తున్నారని, హీరోయిన్‌లుగా బెంగళూరుకు చెందిన అదితిరాయ్‌తోపాటు మరో యాక్టర్‌ ఉంటుందన్నారు. ఇక్కడే 10 రోజుల పాటు షూటింగ్‌ ఉంటుందని తెలిపారు.  నిర్మాతలుగా చల్లా విజయ్‌కుమార్, అభిబాష, కెమెరామోన్‌గా నందనకృష్ణ, మ్యూజిక్‌ డైరెక్టర్‌ శ్రీకోటి, కొరియోగ్రాఫర్‌ బాలకృష్ణ పనిచేస్తున్నారని చెప్పారు. 
 

Advertisement
Advertisement