వేధిస్తున్న నగదు కొరత | Sakshi
Sakshi News home page

వేధిస్తున్న నగదు కొరత

Published Tue, Apr 4 2017 11:59 PM

pensions money problems

  • సామాజిక పింఛ¯ŒSదారుల పడిగాపులు
  • నాలుగు రోజులకు 43 శాతమే పంపిణీ
  • ఇంకా రూ.20 కోట్ల సొమ్ము కోసం ఎదురుచూపులు
  • ఐదు నెలలైనా వెంటాడుతున్న నోట్ల రద్దు ప్రభావం
  • సమన్వయంలోపంతో చుక్కలు చూపిస్తున్న అధికారులు
  • కాకినాడ సిటీ:
    నెల ప్రారంభమై నాలుగు రోజులు గడుస్తున్నా జిల్లాలో ఎన్టీఆర్‌ భరోసా పేరుతో అందజేస్తున్న సామాజిక భద్రతా పింఛన్ల పంపిణీకి నగదు కొరత తప్పడం లేదు. దీంతో వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, చేనేత, కల్లుగీత, అభయహస్తం లబ్ధిదారులు పింఛన్ల సొమ్ము కోసం పడిగాపులు పడాల్సిన పరిస్థితి నెలకొంది. జిల్లా వ్యాప్తంగా 5,09,912 మంది సామాజిక భద్రతా పింఛ¯ŒS  లబ్ధిదారులున్నారు. వీరిలో వృద్ధులు 1,97,295 మంది, వితంతువులు 1,93,851, దివ్యాంగులు 64,791, చేనేత 9.085, కల్లుగీత కార్మికులు 3,989 మంది, అభయహస్తం లబ్ధిదారులు 40,271 మంది ఉన్నారు. వీరందరూ ప్రతినెలా వచ్చే పింఛనే ఆధారంగా కాలం వెళ్లదీస్తున్న వారే. చేతిలో చిల్లిగవ్వ లేక ఇక్కట్ల పాలవ్వాల్సిన పరిస్థితి లబ్థిదారులకు ఎదురు కాకుండా నిర్ధేశించిన తేదీలోపు పంపిణీకి ముందస్తు చర్యలు తీసుకోవాలి్సఉంది. జిల్లా ఉన్నతాధికారులు నగదు కొరతపై ముందస్తు చర్యలు తీసుకోకపోవడంతోపాటు ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిపట్ల పలు విమర్శలు వినిపిస్తున్నాయి.. జిల్లా వ్యాప్తంగా ప్రతినెలా ఒకటో తేదీ నుంచి 5వ తేదీలోపు పింఛన్ల పంపిణీ పూర్తి చేసేందుకు మండలాల వారీగా ఎంపీడీవోలు బ్యాంకుల నుంచి నగదును విత్‌డ్రా చేసి పంపిణీ ప్రారంభించేవారు. నోట్ల రద్దు తరువాత ఈ కష్టాలు ప్రారంభమయ్యాయి. మండలాల్లో ఎక్కడిక్కడ లబ్ధిదారులు పింఛను సొమ్ము కోసం పంపిణీ కేంద్రాలకు నాలుగు రోజులుగా కాళ్ళరిగేలా తిరుగుతున్నా చేతికి నోట్లు అందడం లేదు. 
    చేతులెత్తేసిన బ్యాంకర్లు...
    నగదు కొరతతో వినియోగదారుల అవసరాలమేరకు ఏటీఎంలలో ఆయా బ్యాంకు శాఖలు నగదు పెట్టలేని దుస్థితి జిల్లాలో ఉంది. ఈ దశలో సామాజిక భద్రతా పింఛన్ల చెల్లింపులకు ఇవ్వాల్సిన రూ.55 కోట్లు సర్ధుబాటు చేయలేక బ్యాంకర్లు చేతులెత్తేస్తున్నారు. దీంతో అధికారులు అన్నవరం దేవస్ధానం, మద్యం దుకాణాలు తదితర మార్గాల ద్వారా వచ్చిన నగదును ఆయా బ్యాంకుల నుంచి మంగళవారం నాటికి సుమారు రూ.35 కోట్ల మేర సర్దుబాటు చేయడంతో 43 శాతం మంది లబ్ధిదారులకు పింఛను సొమ్మును పంపిణీ చేయగలిగారు. ఇంకా బ్యాంకుల నుంచి రూ.20 కోట్లు వరకు రావాల్సి ఉంది. ఈ నగదు విడుదల కావాలంటే మూడు నాలుగు రోజులు పడుతుందని అధికారవర్గాలు చెబుతున్నాయి.
     
    11 మండలాలకు ఒక్క రూపాయి విడుదల కాలేదు...
    జిల్లాలో 64 మండలాల్లో 11 మండలాలకు నేటికీ ఒక్క రూపాయి కూడా విడుదల కాలేదు. ఆత్రేయపురం, మామిడికుదురు, అయినవిల్లి, ముమ్మిడివరం, ఐ.పోలవరం మండలాలకు స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా నుంచి, అదేవిధంగా యు.కొత్తపల్లి, కిర్లంపూడి, రంగంపేట, తాళ్ళరేవు, అంబాజీపేట, మల్కిపురం మండలాలకు ఆంధ్రాబ్యాంకు నుంచి విడుదల కావాల్సి ఉంది.
     
     
    పింఛన్ల పంపిణీ గడువు పొడిగించాం...
    బ్యాంకుల్లో నగదు కొరతతో ఇబ్బంది ఏర్పడింది. వివిధ ఆదాయ మార్గాల ద్వారా వచ్చే నగదును బ్యాంకుల నుంచి తీసుకునే విధంగా చర్యలు తీసుకున్నాం. జిల్లాలో పింఛన్ల పంపిణీ గడువును 12వ తేదీ వరకూ పొడిగించాం. అవసరమైతే 15వ తేదీ వరకూ పంపిణీకి గడువు పెంచి లబ్ధిదారులందరికీ పింఛను సొమ్ము అందేలా చర్యలు తీసుకుంటాం. 
    – ఎస్‌.మలి్లబాబు, డీఆర్‌డీఏ పీడీ
     

Advertisement
Advertisement