
వైఎస్ఆర్ జనభేరి షెడ్యూలు విడుదల
వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల్లో సాగించే వైఎస్ఆర్ జనభేరి షెడ్యూలు విడుదలైంది.
వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల్లో సాగించే వైఎస్ఆర్ జనభేరి షెడ్యూలు విడుదలైంది. శనివారం.. మార్చి ఒకటోతేదీన తిరుపతిలో వైఎస్ఆర్ జనభేరి జరుగుతుంది. సాయంత్రం లీలామహల్ సర్కిల్లో జరిగే బహిరంగ సభలో జగన్ పాల్గొంటారు. మార్చి 3, 4 తేదీల్లో పశ్చిమగోదావరి జిల్లాలో జగన్ పర్యటిస్తారు. మూడో తేదీన ఏలూరులోను, నాలుగో తేదీన నిడదవోలులోను బహిరంగ సభలు జరుగుతాయి. ఐదో తేదీన తెలంగాణ ప్రాంతంలోని ఖమ్మం జిల్లాలో వైఎస్ఆర్ జనభేరి ఉంటుంది.
మార్చి 6, 7, 8 తేదీలలో గుంటూరు జిల్లాలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బహిరంగ సభలుంటాయి. మార్చి 6న నరసరావుపేటలోను, 7, 8 తేదీల్లో మాచర్ల నియోజకవర్గంలోను వైఎస్ జగన్ ఓదార్పుయాత్ర చేస్తారు. మార్చి 9 నుంచి14వ తేదీ వరకు నల్గొండ జిల్లాలో ఓదార్పుయాత్ర ఉంటుందని వైఎస్‌ఆర్‌సీపీ ప్రోగ్రాం కోఆర్డినేటర్ తలశిల రఘురాం తెలిపారు.