6న అఖిలేష్ను కలవనున్న వైఎస్ జగన్ | YS Jagan Mohan Reddy to meet Akhilesh Yadav on December 6 | Sakshi
Sakshi News home page

6న అఖిలేష్ను కలవనున్న వైఎస్ జగన్

Dec 3 2013 9:19 PM | Updated on Jul 25 2018 4:09 PM

6న అఖిలేష్ను కలవనున్న వైఎస్ జగన్ - Sakshi

6న అఖిలేష్ను కలవనున్న వైఎస్ జగన్

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈ నెల 6న లక్నో వెళ్లనున్నారు.

హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈ నెల 6న లక్నో వెళ్లనున్నారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్‌ను ఆయన కలవనున్నారు. సమైక్యాంధ్రకు మద్దతు తెలపాలని యూపీ సీఎంను జగన్ కోరనున్నారు. లక్నో వెళ్లేందుకు జగన్కు సీబీఐ ప్రత్యేక కోర్టు నేడు అనుమతి మంజూరు చేసింది.

రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా మద్దతు కూడగట్టడంలో భాగంగా జగన్ రేపు చెన్నైకు వెళ్లనున్నారు. తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితను ఆయన కలుస్తారు. చెన్నై వెళ్లడానికి సోమవారం కోర్టు అనుమతిచ్చింది. జనతాదళ్ (ఎస్) అధినేత దేవెగౌడను 5న (గురువారం) బెంగళూరులో కలిసేందుకు అనుమతించాలంటూ జగన్ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ రేపటికి వాయిదా పడింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement