10 ఏళ్ల ప్రతిపక్షంలో ఉన్నప్పుడు... ఎప్పుడు అధికారంలోకి వస్తామా అని కళ్లు కాయలు కాచేలా ఎదురు చూశారు. తీరా అధికారంలోకి వచ్చాకా ఎందుకు వచ్చామురా 'బాబు' అంటూ తలలు పట్టుకుంటున్నారు పచ్చ తమ్ముళ్లు. పాపం ఎందుకు తమ్ముళ్లు తలలు పట్టుకుంటున్నారు అంటే.... ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమైన తమ్ముళ్లకు ... ఇప్పుడు కాదు తర్వాత చూద్దాం అని లేదా నామినేటేడ్ పదవులు ఉన్నాయిగా అంత కంగారు పనికిరాదని అని తమ్ముళ్లను అధినేత ఎన్నికల మందు లాలించాడు. ఆ తర్వాత ఎన్నికల్లో గెలిచి అధికారం చేపట్టి ఆంధ్రప్రదేశ్ సీఎంగా బాబు పాలించడం మొదలు పెట్టిన తర్వాత 'తమ్ముళ్ల లాలింపు' సంగతి మరచిపోయాడు.
టీటీడీ పాలక మండలి ఛైర్మన్‌గానో లేదా సభ్యునిగానే నామినేటెడ్ పోస్ట్ కొట్టేసి ... తిరుమల శ్రీవారి ఆలయంలో తిష్ఠ వేద్దామనుకున్న తెలుగు తమ్ముళ్ల ఆశల ఇప్పుడిప్పుడే ఫలించేలా లేవు. టీటీడీ పాలక మండలిని ఏర్పాటు చేస్తారని అందరు భావిస్తున్న తరుణంలో రాష్ట్ర దేవాదాయ శాఖ కార్యదర్శి అధ్యక్షతన స్పెసిఫైడ్ అథారటీని ఏర్పాటు చేయడంతో తమ్ముళ్ల ఆశలపై నీళ్లు చిలకరించినట్లు అయింది.ఆ ఆథారటీ తాత్కాలికంగానే అని చెప్పినా దాదాపు రెండు నెలలు మించి ఉంటుందని తమ్ముళ్లలో తెగ దిగులుపట్టుకుంది.
టీటీడీ ఛైర్మన్ పదవి కోసం ఇప్పటికే టీడీపీ ఎంపీలు రాయపాటి సాంబశివరావు, మాగంటి మురళీ మోహన్‌లతోపాటు ఆ పార్టీ నేతలు గాలి ముద్దుకృష్ణమ్మనాయుడు, చదలవాడ కృష్ణమూర్తి తదితరులు ఎంతో ఆతృతతో ఎదురు చూస్తున్నారు. అయితే తమ ప్రభుత్వంలో తమకు విలువ లేకుండా పోయిందని ఆ జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యే బుధవారం హైదరాబాద్‌లో మీడియా ఎదుట వాపోయాడు. స్థానిక ఎమ్మెల్యే, సంబంధిత మంత్రికి చెప్పకుండానే టీటీడీ స్పెసిఫైడ్ అథారటీని సీఎం గారు ప్రకటించారని తన ఆగ్రహాన్ని ఇక మింగలేనంటూ కక్కి మరి చెప్పాడు. అంతేనా టీటీడీ ఛైర్మన్‌గా ఏకపత్నీవ్రతుడ్ని నియమించాలని అధినేతకు హితవు పలికాడు. ఛైర్మన్ గిరి పీఠం అధిష్టించేవారికి వాక్శుద్ధి కూడా ఉండాలని అసలు నిబంధనకు మరో కొసరు నిబంధన తగిలించాడు. అయితే టీటీడీ ఛైర్మన్ కోసం బాబుగారు వెతుకులాట ఇంకా కొనసాగుతునే ఉంది.
ఇదేం ఖర్మరా 'బాబూ'
Published Wed, Aug 27 2014 2:02 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
కాంగ్రెస్‌కు పాకిస్తాన్ మద్దతు ఉంది: అనురాగ్ ఠాకూర్
టాలీవుడ్ హీరో డ్రీమ్ ప్రాజెక్ట్.. రెబల్ స్టార్ ఎంట్రీ!
ఇరాన్ నుంచి పారిపోయి కొచ్చికి భారత మత్స్యకారులు
పాఠశాల నేపథ్యంలో వస్తోన్న సత్య.. ఆసక్తిగా ట్రైలర్!
Best Pictures Of The Day : ఈ రోజు ఉత్తమ చిత్రాలు (06-05-2024)
Video: కేసీఆర్ బస్సును తనిఖీ చేసిన ఎన్నికల అధికారులు
'దేవర' షూటింగ్లో తేనెటీగల కలకలం.. 20 మందికి గాయాలు
ఎస్ఆర్హెచ్తో ముంబై కీలక పోరు.. కొత్త ప్లేయర్ ఎంట్రీ
వారితో భయంకరమైన అనుభవాలు ఎదుర్కొన్నా: హీరామండి నటి
కేజ్రీవాల్‌కు మరో షాక్.. ‘ఎల్జీ’ సంచలన నిర్ణయం
తప్పక చదవండి
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్‌లో ఉన్నా: నటి
- సూపర్ మచ్చీ.. ఇలాంటి గ్రూపు డ్యాన్స్ మీరెపుడైనా చూశారా?
- డైరెక్టర్‌తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- పూంచ్ ఉగ్రదాడి.. టెర్రరిస్టులపై రూ.20 లక్షల రివార్డు
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- ‘SRH కాదు.. పరుగుల విధ్వంసానికి మారు పేరు ఆ జట్టే’
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement