వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే రోజా డిమాండ్
కదిరి(అనంతపురం జిల్లా): ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నోరు మెదపాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నగరి ఎమ్మెల్యే రోజా డిమాండ్ చేశారు. ‘హంద్రీ-నీవా’కు నిధులు కేటాయించాలని ఎమ్మెల్యే విశ్వేశ్వర్‌రెడ్డి చేపట్టిన దీక్షలో పాల్గొనేందుకు ఉరవకొండ వెళ్తూ గురువారం మార్గం మధ్యలో అనంతపురం జిల్లా కదిరిలో స్థానిక ఎమ్మెల్యే అత్తార్ చాంద్‌బాషాతో కలిసి ఆమె విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వడం సాధ్యం కాదని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు చెప్పకనే చెప్పారని, దీనిపై ముఖ్యమంత్రి కేంద్రాన్ని ఎందుకు ప్రశ్నించడం లేదని ఆమె నిలదీశారు ‘‘మా పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి విలువలకు, విశ్వసనీయతకు మారుపేరు. ఆయన మాటకు కట్టుబడే నేత. చంద్రబాబు లాగా పూటకో అబద్ధం చెప్పే నేత కాదు’’ అన్నారు. బాబు పాలనలో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, ముఖ్యంగా రైతులు, డ్వాక్రా అక్క చెల్లెమ్మల ఉసురు చంద్రబాబుకు తగలకతప్పదన్నారు.
హంద్రీ-నీవా ప్రాజెక్టు పనులను అప్పట్లో వైఎస్ రాజశేఖరరెడ్డి యుద్ధప్రాతిపదికన చేయించారని, మిగిలిన 10 శాతం పనులు చేయించడానికి ఇప్పటి సీఎం చంద్రబాబు ఇప్పటికైనా కళ్లు తెరవాలన్నారు. చంద్రబాబుకు ఏం దోషముందో తెలియదు కానీ.. సంక్రాంతికి శనగలు పంపిణీ చేశారన్నారు. హెరిటేజ్ కంపెనీలో ఎన్నో రోజుల నుంచి ముగ్గిపోయిన నెయ్యిని ప్రజలకు అందివ్వడం సరికాదన్నారు. ఎలాంటి టెండర్ పిలవకుండా వాటిని పంపిణీ చేయడం మరో మోసమన్నారు. ముస్లిం మైనార్టీలు ఎప్పటికీ వైఎస్ కుటుంబానికి అండగా ఉంటారని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. కేవలం ఎనిమిది నెలల్లోనే తెలుగుదేశం ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత కనబడుతోందన్నారు. ఈ విషయూన్ని ఆ పార్టీ నేతలే బహిరంగంగా ఒప్పుకుంటున్నారని చెప్పారు.
ప్రత్యేక హోదాపై చంద్రబాబు నోరు విప్పాలి
Published Fri, Jan 30 2015 2:12 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
కాంగ్రెస్‌కు పాకిస్తాన్ మద్దతు ఉంది: అనురాగ్ ఠాకూర్
టాలీవుడ్ హీరో డ్రీమ్ ప్రాజెక్ట్.. రెబల్ స్టార్ ఎంట్రీ!
ఇరాన్ నుంచి పారిపోయి కొచ్చికి భారత మత్స్యకారులు
పాఠశాల నేపథ్యంలో వస్తోన్న సత్య.. ఆసక్తిగా ట్రైలర్!
Best Pictures Of The Day : ఈ రోజు ఉత్తమ చిత్రాలు (06-05-2024)
Video: కేసీఆర్ బస్సును తనిఖీ చేసిన ఎన్నికల అధికారులు
'దేవర' షూటింగ్లో తేనెటీగల కలకలం.. 20 మందికి గాయాలు
ఎస్ఆర్హెచ్తో ముంబై కీలక పోరు.. కొత్త ప్లేయర్ ఎంట్రీ
వారితో భయంకరమైన అనుభవాలు ఎదుర్కొన్నా: హీరామండి నటి
కేజ్రీవాల్‌కు మరో షాక్.. ‘ఎల్జీ’ సంచలన నిర్ణయం
తప్పక చదవండి
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్‌లో ఉన్నా: నటి
- సూపర్ మచ్చీ.. ఇలాంటి గ్రూపు డ్యాన్స్ మీరెపుడైనా చూశారా?
- డైరెక్టర్‌తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- పూంచ్ ఉగ్రదాడి.. టెర్రరిస్టులపై రూ.20 లక్షల రివార్డు
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- ‘SRH కాదు.. పరుగుల విధ్వంసానికి మారు పేరు ఆ జట్టే’
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement