వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహనరెడ్డిని కట్టడి చేసేందుకు ఆయన్ను అరెస్టు చేశారని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ నేత మోపీదేవి వ్యాఖ్యనించారు.
రేపల్లె: వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహనరెడ్డిని కట్టడి చేసేందుకు ఆయన్ను అరెస్టు చేశారని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ నేత మోపీదేవి వెంకటరమణ వ్యాఖ్యనించారు. దీనికోసం మంత్రులంతా నీచ రాజకీయాలు చేశారని ఆయన అభిప్రాయపడ్డారు. గుంటూరు జిల్లాలోని రేపల్లె బహిరంగ సభలో ప్రసంగించిన మోపీదేవి తనపట్ల ప్రభుత్వం ప్రదర్శించిన వైఖరిపై మండిపడ్డారు.జగన్ను ఎదుర్కొలేక అరెస్టు డ్రామా నడిపారని ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. దీని కోసం తనను ఎరగ వేసి ఓ పావులా వాడుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
'నన్ను అరెస్టు చేసిన అనంతరం సీఎంతో సహా మంత్రులంగా అండగా ఉంటామన్నారు. మా ఇంటికి వచ్చి కుటుంబానికి భరోసా ఇచ్చారు. జైలు నుంచి తీసుకొస్తామన్నారు. తీరా చూస్తే మా మనిషి కాదంటూ నన్ను, నా కుటుంబాన్ని ఇబ్బందులకు గురి చేశారని 'మోపీదేవి తెలిపారు. తనకు అనారోగ్యం చేస్తే కనీసం పట్టించు కోలేదన్నారు. తాను ఏనాడు ఏ తప్పూ చేయలేదని తెలిపారు. మిగతా మంత్రులను రక్షించి తనను బలిపశువును చేశారన్నారు. ఆ మంత్రులు చేసిన ఒప్పేంటి? తాను చేసిన తప్పేంటో చెప్పాలని కిరణ్ సర్కారును ప్రశ్నించారు. రాష్ట్రంలోని రాజకీయాలు దిగజారి పోయాయని ఆయన తెలిపారు.