తిరుమలలో హిందూ ధార్మిక సదస్సు ప్రారంభం | Sakshi
Sakshi News home page

తిరుమలలో హిందూ ధార్మిక సదస్సు ప్రారంభం

Published Wed, Dec 2 2015 10:27 AM

తిరుమలలో హిందూ ధార్మిక సదస్సు  ప్రారంభం

తిరుమల: తిరుమలలో సనాతన ధార్మిక సదస్సు బుధవారం ఉదయం ప్రారంభం అయింది. హిందూ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఇక్కడి ఆస్ధాన మండపంలో సదస్సు నిర్వహిస్తున్నారు. ఈ సదస్సులో 40 మందికి పైగా పలువురు పీఠాధిపతులు, మఠాధిపతులు, ధార్మిక వేత్తలు పాల్గొన్నారు. పీఠాధిపతులు పలు ధార్మిక అంశాలపై చర్చించి, పలు తీర్మానాలు చేస్తారు. ఈ సదస్సు టీటీడీ ఈవో సాంబశివరావు, చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి, దేవాదాయ శాఖ మంత్రి మాణిక్యాలరావు లు  కార్యక్రమంలో పాల్గొని సదస్సునుద్దేశించి మాట్లాడారు. 
 
కాగా తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. సర్వదర్శనానికి 3 గంటలు, కాలినడకన భక్తులకు 2 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటల సమయం పడుతోంది. 

Advertisement
Advertisement