రాజధాని నిర్మాణానికి దొనకొండ అనుకూలం | donakonda is suitable for capital, says yv subbareddy | Sakshi
Sakshi News home page

రాజధాని నిర్మాణానికి దొనకొండ అనుకూలం

Jul 23 2014 6:49 PM | Updated on May 29 2018 4:15 PM

రాజధాని నిర్మాణానికి దొనకొండ అనుకూలం - Sakshi

రాజధాని నిర్మాణానికి దొనకొండ అనుకూలం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని నిర్మాణానికి దొనకొండ ప్రాంతం అయితే అనుకూలంగా ఉంటుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి అన్నారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని నిర్మాణానికి దొనకొండ ప్రాంతం అయితే అనుకూలంగా ఉంటుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. బుధవారం ఆయన ఢిల్లీలో శివరామకృష్ణన్ కమిటీ సభ్యులను కలిసి, అనంతరం మీడియాతో మాట్లాడారు. దొనకొండ ప్రాంతం అటు ఆంధ్రా ప్రాంతానికి, ఇటు రాయలసీమకు సరిగ్గా మధ్యలో ఉంటుందని, అందువల్ల అది అందరికీ అందుబాటులో ఉంటుందని సుబ్బారెడ్డి అన్నారు.

ఇప్పటికే అభివృద్ధి చెందిన ప్రాంతాలలో కాకుండా, కాస్త వెనకబడిన ప్రాంతంలో రాజధాని నగరాన్ని నిర్మిస్తే, అక్కడి ప్రజలందరూ అభివృద్ధి చెందుతారని తాను సూచించినట్లు వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. కమిటీ సభ్యులు తమ విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించారని, త్వరలో వచ్చి దొనకొండ ప్రాంతాన్ని పరిశీలిస్తామన్నారని ఆయన చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement