సాంకేతిక పరిజ్ఞానంతో నేరాల నియంత్రణ | Sakshi
Sakshi News home page

సాంకేతిక పరిజ్ఞానంతో నేరాల నియంత్రణ

Published Mon, Aug 21 2017 3:18 AM

సాంకేతిక పరిజ్ఞానంతో నేరాల నియంత్రణ - Sakshi

నెల్లూరులో లాక్డ్‌ హౌస్‌ మానిటరింగ్‌ సిస్టమ్‌ అందుబాటులోకి
ఇతర జిల్లాల్లోనూ ప్రవేశపెట్టేందుకు చర్యలు
గుంటూరు రేంజ్‌ డీఐజీ కేవీవీ గోపాల్‌రావు


నెల్లూరు సిటీ: సాంకేతిక పరిజ్ఞానంతో నేరాలను నియంత్రించవచ్చని గుంటూరు రేంజ్‌ డీఐజీ కేవీవీ గోపాల్‌రావు పేర్కొన్నారు.  డీఐజీగా తొలిసారిగా జిల్లాకు వచ్చిన ఆయన నగరంలోని ఉమేష్‌చంద్ర కాన్ఫరెన్స్‌హాల్లో  జిల్లా పోలీసు అధికారులతో ఆదివారం సమీక్ష సమావేశం నిర్వహించారు.   ఎవరైనా నేరాలు చేయాలంటే భయపడే విధంగా పోలీసులు వ్యవహరించాలన్నారు. జిల్లాలో పెండింగ్‌లో ఉన్న కేసులపై ఆరా తీశారు.

ఎర్రచందనం, ఇసుక అక్రమ రవాణా, క్రికెట్‌ బెట్టింగ్‌పై చర్యలను అడిగి తెలుసుకున్నారు. ఎవరికీ భయపపడకుండా బాధ్యతాయుతంగా పనిచేయాలని అధికారులకు సూచించారు. జిల్లాలో లా అండ్‌ అర్డర్‌ సమస్య రాకుండా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలని సూచించారు.  జిల్లాలో సీసీ కెమారాలు ఏర్పాటుకు చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. క్రికెట్‌ బెట్టింగ్‌ కేసులో ఎస్పీ రామకృష్ణ చర్యలు అభినందనీయమన్నారు. ఇప్పటి వరకు జిల్లాలో 205 మంది బెట్టింగ్‌ రాయుళ్లను అరెçస్ట్‌ చేసినట్లు తెలిపారు. రూ.50లక్షలు నగదు, బంగారం స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు.

  పోలీసులు బెట్టింగ్‌ నియంత్రణకు చర్యలు తీసుకోవాలని సూచించారు. నెల్లూరుతో పాటు మిగిలిన జిల్లాల్లోనూ క్రికెట్‌ బెట్టింగ్‌లు అరికట్టేందుకు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. గ్యాంబ్లింగ్, బెట్టింగ్‌లకు ప్రజలు దూరంగా ఉండాలన్నారు. లేకపోతే జీవితాలు నాశనమవుతాయన్నారు.  ఎక్కడైనా ఇలాంటి వ్యవహారాలు జరుగుతుంటే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామన్నారు. అనంతరం కమాండ్‌ కంట్రోల్, క్యాంపు కార్యాలయాన్ని పరిశీలించారు. ఎస్పీ రామకృష్ణ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో అడిషనల్‌ ఎస్పీ శరత్‌బాబు, డీఎస్పీలు, సీఐ పాల్గొన్నారు.

Advertisement
Advertisement