
'ఇంటికయ్యే ఖర్చు రాజధానికి విరాళం ఇవ్వచ్చుగా'
చంద్రబాబు కోట్ల రూపాయలతో హైదరాబాద్ లో ఇల్లు కట్టుకుంటూ రాజధాని ప్రాంతంలో రైతులను చెట్ల కింద ఉండమంటారా అని వైఎస్ఆర్సీపీ మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి(ఆర్కే) ప్రశ్నించారు.
హైదరాబాద్: చంద్రబాబు కోట్ల రూపాయలతో హైదరాబాద్ లో ఇల్లు కట్టుకుంటూ రాజధాని ప్రాంతంలో రైతులను చెట్ల కింద ఉండమంటారా అని వైఎస్ఆర్సీపీ మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి(ఆర్కే) ప్రశ్నించారు. చంద్రబాబు ఇంటికయ్యే ఖర్చు రాజధానికి విరాళం ఇవ్వాలని సూచించారు.
టీడీపీ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు విరాళాలు ఇవ్వకుండా ప్రజలను చందాలు అడగడం ఎంతవరకు సమంజసమని ఆయన సూటిగా ప్రశ్నించారు. ఏపీ రాజధాని నిర్మాణానికి నిధులు ఇవ్వాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ఇంటిముందు ధర్నా చేసైనా నిధులు తీసుకురావాలని, ప్రజల్ని ఇబ్బంది పెట్టొద్దని రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు.