Sakshi News home page

వర్షాల సీజన్‌ నేపథ్యంలో ఇక ప్రతివారం చివర్లో

Published Thu, Oct 26 2023 7:38 AM

బీసెంట్‌ నగర్‌లో వాకింగ్‌ ట్రాక్‌ మ్యాప్‌ను పరిశీలిస్తున్న మంత్రి  - Sakshi

సాక్షి, చైన్నె : వర్షాల సీజన్‌ నేపథ్యంలో ఇక ప్రతివారం చివర్లో రాష్ట్ర వ్యాప్తంగా 1000 వైద్య శిబిరాలను ఏర్పాటు చేయనున్నామని ఆరోగ్యశాఖ మంత్రి ఎం. సుబ్రమణియన్‌ తెలిపారు. చైన్నె బీసెంట్‌ నగర్‌లో వాకింగ్‌ కోసం కేటాయించిన మార్గాన్ని ఆయన బుధవారం పరిశీలించారు. అనంతరం ఎం. సుబ్రమణియన్‌ మీడియాతో మాట్లాడుతూ, వర్షాల సీజన్‌ నేపథ్యంలో వచ్చే జ్వరాలను కట్టడి చేయడానికి ప్రత్యేక చర్యలు చేపట్టామన్నారు. రానున్న 10 వారాల పాటు వారాంతంలో ప్రత్యేక వైద్య శిబిరాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. అన్ని రకాల పరీక్షలూ ఈ శిబిరాల్లో నిర్వహించి రోగులకు మందులను పంపిణీ చేస్తామన్నారు. ప్రజా ఆరోగ్య సంరక్షణలో భాగంగా చైన్నెతో పాటు 38 జిల్లాల్లో వాకింగ్‌ కోసం ప్రత్యేక మార్గం ఏర్పాటు పనులను వేగవంతం చేస్తున్నామని, చైన్నెలో బీసెంట్‌ నగర్‌ బీచ్‌ మార్గాన్ని తాజాగా పరిశీలించామన్నారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య కార్యదర్శి గగన్‌ దీప్‌సింగ్‌ బేడీ, చైన్నె కార్పొరేషన్‌ కమిషనర్‌ రాధాకృష్ణన్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement