పవన్ కల్యాణ్‌ను ఓడించేది టీడీపీనే: కొడాలి నాని | Sakshi
Sakshi News home page

పవన్ కల్యాణ్‌ను ఓడించేది టీడీపీనే: కొడాలి నాని

Published Mon, Mar 4 2024 1:26 PM

kodali nani Appeal Fans Cadre Of Pawan Over TDP Conspiracy - Sakshi

కృష్ణా: అభిమానులు అప్రమత్తంగా లేకపోతే పవన్ కల్యాణ్‌ మూల్యం చెల్లించుకుంటాడని మాజీ మంత్రి కొడాలి నాని అన్నారు. పవన్ కల్యాణ్‌ను రక్షంచుకోవాల్సిన అవసరం జనసైనికులు.. అభిమానులకు ఉందని తెలిపారు. ఈమేరకు సోమవారం ఆయన జన సైనికులు, పవన్ కల్యాణ్‌ అభిమానులకు విజ్ఞప్తి చేశారు. ‘చంద్రబాబు ఓట్లు కావాలి... కానీ సీట్లు ఇవ్వరు. మేము రాష్ట్రంలో ఏ నియోజకవర్గాన్ని టార్గెట్‌గా పెట్టుకోలేదు...175 స్థానాల్లో గెలవడమే మా లక్ష్యం. కచ్చితంగా చెబుతున్నా పవన్ కల్యాణ్‌ను ఓడించేది టీడీపీనే. ఎన్నికల అనంతరం ఈ విషయం స్పష్టంగా తెలుస్తుంది.

...వెన్నుపోటుకి బ్రాండ్ అంబాసిడర్లు అయిన చంద్రబాబు, నాదెండ్లను పవన్ కల్యాణ్‌ పక్కన పెట్టుకుని తిరుగుతున్నాడు. అధికారంలో ఉన్న ఎన్టీఆర్నే కూల్చిపడేసిన చంద్రబాబు, నాదెండ్ల వారికి పవన్ ఎంత?. 3 శాతం ఓటింగ్ ఉన్న తన సామాజిక వర్గానికి 30 సీట్లు ఇచ్చి.. 20 శాతం ఉన్న వర్గానికి 24 సీట్లిచ్చాడు.

... జనసేనకి ఇచ్చిన సీట్లలో పది కచ్చితంగా ఓడిపోయే సీట్లు ఉన్నాయి. ఇవ్వడానికి చంద్రబాబుకి.. తీసుకోవడానికి పవన్‌కు సిగ్గుండాలి. రాజ్యాధికారం కోసం ఎదురుచూస్తున్న పవన్ సామాజిక వర్గం ఓట్లు ట్రాన్స్ ఫర్ అవ్వవు’ అని కొడాలి నాని అన్నారు.

కృష్ణాజిల్లా: సచివాలయం కూడా తాకట్టు పెట్టేశారన్న చంద్రబాబు వ్యాఖ్యలపై మాజీ మంత్రి కొడాలి నాని ఫైర్ అయ్యారు. సచివాలయాన్ని తాకట్టు పెట్టారని చంద్రబాబుకు గగ్గోలు పెడుతున్నాడని మండిపడ్డారు. ‘నేడు రాష్ట్ర అప్పులు రూ. 4లక్షల కోట్లు ఉంటే... రూ. 2.50లక్షల కోట్లు చంద్రబాబు చేసినవే. ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెట్టకుండానే... చంద్రబాబు రెండున్నర లక్షల కోట్లు అప్పు చేశారా?.

ప్రజలకు అవసరమైనప్పుడు... ప్రభుత్వ ఆస్తులను బ్యాంకులకు తాకట్టు పెట్టడం మామూలే. సచివాలయం అనేది పది ఎకరాల ఆస్తి మాత్రమే. ప్రత్యేకించి ఏ ఆస్తులు తాకట్టు పెట్టాలో అన్న విషయం రాజ్యాంగంలో ఏమైనా రాశారా? ప్రజల అవసరాల కోసం...ప్రభుత్వ వెసులుబాటును బట్టే ఆస్తులు తాకట్టు పెట్టడం జరుగుతుంది. చిల్లర రాజకీయ నాయకుడు.. చంద్రబాబు చేస్తేనే సంసారం’ అని కొడాలి నాని  అన్నారు.

Advertisement
Advertisement