UP Wedding: Bride Refuses To Marry Bald Head Groom, Goes Viral - Sakshi
Sakshi News home page

Viral Wedding: పెళ్లి మధ్యలో సొమ్మసిల్లిన వరుడు.. వధువుకి షాక్‌, ఆగిపోయిన పెళ్లి

Published Mon, May 23 2022 2:11 PM

UP Wedding: Bald head Bride Groom Rejected By Bride - Sakshi

పెళ్లిళ్లు స్వర్గంలో నిర్ణయించబడతాయని అనడం ఏమోగానీ.. పచ్చని పెళ్లి పందిట్లోనే రద్దు అవుతున్నాయి. అయితే బలవంతంగా పెళ్లితో ఒక్కటై.. జీవితాంతం నరకం అనుభవించే బదులు.. ముందుగానే ఆపేయడం మేలని అనుకుంటున్నారు చాలామంది. అలాంటి ఘటనే ఇప్పుడు చెప్పుకోబోయేది. 

పెళ్లి వేడుక‌లో అమ్మాయి, అబ్బాయి త‌ర‌ఫు బంధువులు అంద‌రూ ఎంతో సంతోషంగా పాల్గొంటున్నారు. కాసేప‌ట్లో త‌న‌ పెళ్లి అయిపోతుంద‌ని పెళ్లి కొడుకు సంబ‌ర‌ప‌డిపోతున్నాడు. అయితే, అల‌సిపోయి పెళ్లి కొడుకు స్పృహ తప్పిపడిపోయాడు. దీంతో అత‌డిని లేపేందుకు పెళ్లికూతురు సోదరుడు ముఖంపై నీళ్లు చల్లి, తలపాగా తీయ‌బోయాడు. అదే స‌మ‌యంలో వ‌రుడి విగ్గు ఊడిపోయింది. ఇంకేం.. 

పెళ్లి కూతురు సహా బంధువులు అంతా షాకయ్యారు. పెళ్లి కొడుకుకి బ‌ట్ట‌త‌ల ఉంద‌ని త‌మ‌కు ముందుగా ఎందుకు చెప్ప‌లేద‌ని, ఇంత మోసం చేస్తారా? అంటూ నిల‌దీశారు. బట్టతల ఉన్న వ్యక్తిని పెళ్లి చేసుకోనని పెళ్లికూతురు స్ప‌ష్టం చేసింది. దీంతో ఇరు కుటుంబ స‌భ్యుల మ‌ధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. ఈ విష‌యాన్ని తెలుసుకున్న పోలీసులు వెంట‌నే పెళ్లి వేడుక వ‌ద్ద‌కు వ‌చ్చారు. ఇరు కుటుంబాలను స‌ముదాయించి, గొడ‌వ‌ను ఆపారు. కానీ, పెళ్లిని మాత్రం జరపలేకపోయారు.

చివ‌రి నిమిషంలో పెళ్లి ర‌ద్దు కావ‌డంతో వ‌రుడు తీవ్ర నిరాశ చెందాడు. అంతా వెనక్కి తిరిగి వెళ్లిపోయారు. ఉత్తరప్రదేశ్ లోని ఉన్నావ్ లో ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. పెళ్లి కొడుకు కుటుంబ స‌భ్యుల‌పై త‌మ‌కు ఫిర్యాదు అంద‌లేద‌ని పోలీసులు తెలిపారు. ముందుగా తెలిసినా తమ అమ్మాయి సిద్ధమై ఉండేదేమోనని, ఇలా మోసం చేసి చేయడంతో ఆమెకు సహించడం లేదని బంధువులు చెప్తున్నారు. 

చదవండి: తాళి కట్టే సమయానికి కుప్పకూలిన వధువు.. భలే ట్విస్ట్‌

Advertisement
 
Advertisement
 
Advertisement