తెరపై గర్బిణీలుగా మెప్పించిన నటీమణులు వీళ్లే.. | Sakshi
Sakshi News home page

తెరపై గర్బిణీలుగా మెప్పించిన నటీమణులు వీళ్లే..

Published Wed, Nov 24 2021 7:44 PM

Top 5  Actresses Who Played Pregnant Women Role - Sakshi

Top 5  Actresses Who Played Pregnant Women Role: ప్రయోగాత్మక పాత్రల్లో నటించేందుకు బాలీవుడ్‌ హీరోయిన్స్‌ ఎప్పుడూ ముందుంటారు. పలు ప్రయోగాత్మక పాత్రల్లో నటిస్తూ బీటౌన్‌ నటీమణులు తమ సొంత బ‍్యాంకింగ్‌ను ఏర్పర్చుకుంటున్నారు. మహిళా ప్రాధాన్యత చిత్రాల నుంచి బోల్డ్‌ క్యారెక్టర్ల వరకు పేరు తెచ్చుకుంటున్నారు. సినిమాల‍్లో కేవలం ఒక భాగం, సహాయక పాత్రలకు పరిమితం కాకుండా తమకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తున‍్నారు. ఇలా చాలా మంది నటీమణులు తల్లి పాత్రను పోషించారు. ఏ సంకోచం లేకుండా గర్భిణీ పాత్రలకు సైతం మొగ్గు చూపారు. ఈ గర్భిణీ స్త్రీలుగా  తెరపై నటించిన బాలీవుడ్‌ నటీమణులు ఎవరెవరో ఓసారి చూద్దామా !

1. నుష్రత్‌ భరుచ్చా (ఛోరీ)

హిందీలో వస్తున్న హార్రర్‌ మూవీ 'ఛోరీ'లో నుష్రత్‌ భరుచ్చా గర్భిణీగా నటించారు. ఈ పాత్రలోకి పరకాయ ప్రవేశం చేసేందుకు ఎంతో కష్టపడ్డారు. సినిమా షూటింగ్‌కు సుమారు 25 రోజుల ముందు 'గర్భిణీ బాడీసూట్‌'ను ధరించడం ప్రారంభించారు. ఈ విషయంపై ఆమె 'ఇప్పుడు నిజ జీవితంలో నేను గర్భివతిని కాలేను. కాబట్టి, ఒక బిడ్డను మోసే స్త్రీ ఎలా ఉంటుంది. ఆమె ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొంటుంది. ఏం అనుభవిస్తుందో తెలుసుకోడానికే ఆ బాడీసూట్‌ను తయారు చేసుకున్నాను. గర్భిణీలకు వచ్చే సమస్యలను తెలుసుకోడానికి సినిమా షూటింగ్‌ ప్రారంభానికి 20-25 రోజుల ముందు ఆ బాడీసూట్‌ను ధరించాను. దాంతోనే తినడం, పడుకోవడం, బాత్రూమ్‌కు వెళ్లడం, చుట్టూ తిరగడం చేశాను.' అని తెలిపారు. 

2. విద్యా బాలన్‌ (కహానీ)

భారతీయ చలనచిత్ర రంగంలో మహిళల చిత్రీకరణలో మార్పు తీసుకురావడానికి పేరుగాంచిన నటి విద్యా బాలన్‌. 'కహానీ' చిత్రంలో గర్భిణీగా నటించి.. అందరి మెప్పు పొందారు. ఇందులో ప్రొస్తెటిక్‌ బేబీ బంప్‌ను ధరించి నటించారు విద్యా బాలన్‌. ఆమె ఎంతో చక్కగా, పరిపూర్ణతో ఆ పాత్రను పోషించారు. ప్రేక్షకులను కంటతడి పెట్టించి, విమర్శకుల ప్రశంసలు పొందారు. ప్రజల నుంచి మంచి ఆదరణ కూడా పొందారు. దీనికి రీమెక్‌గా తెలుగులో నయనతార హీరోయిన్‌గా 'అనామిక' రూపొందించారు. కానీ అందులో ఆమెను గర్భిణీ పాత్రలో చేయలేదు. 

3. నీనా గుప్తా (బధాయి హో) 

2018లో నటి నీనా గుప్తా, అమిత్‌ శర్మతో కలిసి 'బధాయి హో' సినిమాలో యాక్ట్‌ చేశారు. ఈ చిత్రంలో ఆమె 50 ఏళ్ల గర్భిణీ పాత్రను పోషించారు. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ చిత్రాల్లో ఒకటిగా మంచి గుర్తింపు వచ్చింది ఈ సినిమాకు. 'పూర్తి వినోదాత్మకంగా అత్యంత ప్రజాధారణ పొందిన ఉత్తమ చిత్రం' విభాగంలో జాతీయ అవార్డును కూడా గెలుచుకుంది. 

4. కరీనా కపూర్‌ ఖాన్‌ (గుడ్‌ న్యూస్‌)

గుడ్‌ న్యూస్‌ సినిమాలో దీప్తి బాత్రాగా కరీనా కపూర్ పాత్ర 21వ శతాబ్దపు మహిళలకు చాలా దగ్గరగా ఉంటుంది. ఆమె ఒక స్వతంత్ర, స్వయం సమృద్ధి గల వ్యక్తి పాత్రను పోషించారు. ఆమె కూడా బిడ్డను కలిగి ఉండాలని కోరుకునే అమ్మాయి కథ. తెరపై గర్భిణీ స్త్రీ పాత్రను వివరిస్తూ, గర్భధారణ సమయంలో స్త్రీ పడే కష్టాలు, ప్రభావాలు తెలిసేలా చక్కగా నటించారు.  అందులో కియారా అద్వానీ కూడా గర్భిణీ పాత్రలో కనిపించారు. 

5. కృతి సనన్‌ (మిమి)

'మిమి' చిత్రంలో కృతి సనన్ ఒక సరోగసి తల్లి పాత్రలో నటించారు. ఈ పాత్రతో ఆమె నటనకు మంచి బ్రేక్‌ వచ్చింది. ఎంతో పరిణితీ ఉన్న నటిగా ఆమె నిరూపించుకుంది. ఆ పాత్ర కోసం కృతి సనన్‌ సుమారు 15 కిలోల బరువు పెరగాల్సి వచ్చింది. 

 

Advertisement
 
Advertisement
 
Advertisement