ట్రాఫిక్‌.. క్లియర్‌! | Sakshi
Sakshi News home page

ట్రాఫిక్‌.. క్లియర్‌!

Published Sat, Apr 20 2024 1:45 AM

- - Sakshi

కరీంనగర్‌క్రైం:నగరంలోని మార్కెట్‌ ఏరియాల్లో విపరీతమైన రద్దీ ఉంటోంది. వాహనాలు వెళ్లడం కష్టతరమవడంతో పాటు పార్కింగ్‌ ప్రదేశాలు లేక ప్రజలు ఇన్ని రోజులు నరకం చూశారు. నో పార్కింగ్‌ ప్రదేశాల్లో వాహనాలు నిలిపితే ఫైన్‌లు పడడం, పార్కింగ్‌కు ప్రత్యేక స్థలాలు లేకపోవడంతో నానా తిప్పలు పడేవారు. ముఖ్యంగా టవర్‌సర్కిల్‌, ప్రధాన కూరగాయాల మార్కెట్‌, ప్రకాశం గంజ్‌కు వచ్చే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతుండడంతో వాహనాలు నిలపడం కష్టంగా మారింది. ఈ తరుణంలో పోలీసులు పార్కింగ్‌కు ప్రత్యేక స్థలాలు కేటాయించి పార్కింగ్‌ కష్టాలకు పోలీసులు పరిష్కారం చూపడంతో వాహనదారులకు ఊరట కలిగింది.

నగరంలో టవర్‌సర్కిల్‌, మార్కెట్‌

ప్రాంతంలో రద్దీ

పెరుగుతున్న వాహనాలు

కష్టాలకు బ్రేక్‌ వేసిన ట్రాఫిక్‌ పోలీసులు

పార్కింగ్‌కు స్థలాలు కేటాయింపు

రెండు ప్రదేశాల్లో పార్కింగ్‌

నగరంలో అతి ఎక్కువ రద్దీగా ఉండే ప్రాంతమంటేనే టవర్‌సర్కిల్‌, ప్రధాన కూరగాయల మార్కెట్‌, ప్రకాశం గంజ్‌లు. ఈ ప్రాంతాలు దుస్తులు, కూరగాయాలు, భవన నిర్మాణ సామగ్రి, ప్లాస్టిక్‌ దుకాణాలు, నూనె, ఇతరత్రా వ్యాపారాలకు నిలయం. ఎక్కువగా ఈ ప్రాంతాలకు నగరవ్యాప్తంగా ఉండే ప్రజలతో పాటు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రజలు, వ్యాపారులు వస్తుంటారు. దీంతో సుమారుగా రోజు ఉదయం నుంచి రాత్రి వరకు సుమారుగా 1 లక్ష మంది వరకు వచ్చిపోతుండగా 40 వేలకు పైగా వాహనాలు వచ్చి వెళ్తుంటాయి. గతంలో పాత టెలిఫోన్‌ భవన్‌ వద్ద గల చౌరస్తా వద్ద రోడ్డు మీదనే కార్లు పార్కింగ్‌ చేయడం, బైకులు రోడ్డు మద్యలోనే పార్కింగ్‌ చేస్తుండడంతో ట్రాఫిక్‌ రద్దీ పెరిగి వాహనాలు నిలిచిపోతుండేవి. కలెక్టర్‌ క్యాంపు కార్యాలయం ఎదురుగా గల మున్సిపల్‌ స్థలంతో పాటు ఇంటిగ్రెటెడ్‌ మార్కెట్‌లలో రెండు ప్రదేశాల్లో ప్రత్యేకంగా వాహనాలు నిలిపేందుకు పార్కింగ్‌ ప్లేస్‌లు ఏర్పాటు చేశారు. వాహనదారులు గతంలో ఎదుర్కొన్న ట్రాఫిక్‌ సమస్యలైన ట్రాఫిక్‌ సిగ్నల్‌, పార్కింగ్‌ ప్లేస్‌లు లేక పడిన రెండు సమస్యలకు పోలీసులు పరిష్కారం చూపారు.

కరీంనగర్‌రూరల్‌: కరీంనగర్‌ మండలం చెర్లభూత్కూర్‌లో శ్రీచెన్నకేశవ స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం వేదపండితులు సుధాకర్‌శర్మ, కమలాకర్‌, శ్రీనివాస్‌శర్మల ఆధ్వర్యంలో శ్రీ భూనీలా–చెన్నకేశవ స్వామి కల్యాణాన్ని ఘనంగా నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ బుర్ర తిరుపతిగౌడ్‌, కరీంనగర్‌ సింగిల్‌విండో చైర్మన్‌ పెండ్యాల శ్యాంసుందర్‌రెడ్డి, మాజీ సర్పంచ్‌ దబ్బెట రమణారెడ్డి, ఆలయ కమిటీ ప్రతినిధులు కూర నరేశ్‌రెడ్డి, శ్యాంసుందర్‌రెడ్డి, అనంతరెడ్డి, మాసగోని రమేశ్‌గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

ప్రత్యేకంగా పార్కింగ్‌ కోసం

నగరంలో వాహనదారులు ఎదుర్కొంటున్న పార్కింగ్‌ సమస్యకు ఉన్నతాధికారుల ఆదేశాల ప్రకారం రెండు పార్కింగ్‌ స్థలాలు ఏర్పాటు చేశాం. గతంలోని మున్సిపల్‌ స్థలం, ఇంటిగ్రేటెడ్‌ మార్కెట్‌ కోసం ఏర్పాటు చేసిన స్థలాల్లో పార్కింగ్‌ చేపిస్తున్నాం. రోడ్ల మీద, రోడ్డుకు ఇరువైపులా పార్కింగ్‌ చేయకుండా చర్యలు తీసుకుంటున్నాం. వాహనదారులు ప్రత్యేకంగా పార్కింగ్‌ ఏర్పాటు చేసిన స్థలంలోనే పార్కింగ్‌ చేయాలి.

– ఎండీ. కరీం ఉల్లా ఖాన్‌,

ట్రాఫిక్‌ సీఐ

1/3

మార్కెట్‌ ప్రాంత పార్కింగ్‌ స్థలంలో పోలీసులు
2/3

మార్కెట్‌ ప్రాంత పార్కింగ్‌ స్థలంలో పోలీసులు

3/3

Advertisement
 
Advertisement
 
Advertisement