ఎన్నికల వ్యయ వివరాలు పారదర్శకంగా ఉండాలి | Sakshi
Sakshi News home page

ఎన్నికల వ్యయ వివరాలు పారదర్శకంగా ఉండాలి

Published Sat, Apr 20 2024 1:45 AM

మాట్లాడుతున్న కోమటిరెడ్డి నరేందర్‌ రెడ్డి, పక్కన కాంగ్రెస్‌ నాయకులు - Sakshi

● ఎన్నికల వ్యయ పరిశీలకుడు అశ్విని కుమార్‌ పాండే
నేటి నుంచి ఇంటింటికీ కాంగ్రెస్‌

కరీంనగర్‌: ఎన్నికల వ్యయ వివరాలు పారదర్శకంగా నమోదు చేయాలని ఎంసీఎంసీ కమిటీ సభ్యులకు కరీంనగర్‌ లోక్‌సభ నియోజకవర్గ ఎన్నికల వ్యయ పరిశీలకుడు అశ్వినికుమార్‌ పాండే సూచించారు. శుక్రవారం కరీంనగర్‌ కలెక్టరేట్‌లోని మీడియా సెంటర్‌, కంట్రోల్‌రూంను పరిశీలించారు. మీడియా సెంటర్‌ పనితీరుతో పాటు పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రింట్‌, ఎలక్ట్రానిక్‌ మీడియా, సోషల్‌ మీడియాలో వచ్చే ఎన్నికల ప్రకటనలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. పెయిడ్‌ ఆర్టికల్స్‌ను పర్యవేక్షిస్తూ వ్యయ వివరాలు నమోదు చేయాలన్నారు. కంట్రోల్‌రూం పనితీరును అడిగి తెలు సుకున్నారు. సీ విజిల్‌ యాప్‌ ద్వారా వచ్చిన కేసులు, తీసుకున్న చర్యలను తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ.. అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. ఎలాంటి ఫిర్యాదులు వచ్చినా వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలన్నారు. సమాచార, పౌర సంబంధాలశాఖ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ లక్ష్మణ్‌ కుమార్‌, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్‌ ఇన్ఫర్మేషన్‌ ఇంజినీర్‌ కొండయ్య, ఏపీఆర్‌ఓ వీరాంజనేయులు, కంట్రోల్‌ రూమ్‌ నోడల్‌ ఆఫీసర్‌ ఎస్‌.నాగార్జున పాల్గొన్నారు.

సిటీ కాంగ్రెస్‌ అధ్యక్షుడు కోమటిరెడ్డి

కరీంనగర్‌ కార్పొరేషన్‌: కాంగ్రెస్‌ పార్టీ మేనిఫెస్టోలో పొందుపరిచిన పంచ న్యాయాల (పాంచ్‌న్యాయ్‌) గ్యారంటీ కార్డులను నగరంలోని ప్రతీ గడపకు తీసుకెళ్తామని సిటీ కాంగ్రెస్‌ అధ్యక్షుడు, సుడా చైర్మన్‌ కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి తెలిపారు. శనివారం నుంచి ఇంటింటికి వెళ్లి పంచ న్యాయాలు అందజేస్తూ, బీఆర్‌ఎస్‌, బీజేపీ వైఫల్యాలను ప్రజలకు వివరిస్తామన్నారు. శుక్రవారం నగరంలోని సిటీ కాంగ్రెస్‌ కార్యాలయంలో మాట్లాడు తూ.. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆరు గ్యారంటీల తరహాలోనే కేంద్రంలో కాంగ్రెస్‌ పాంచ్‌న్యాయ్‌ను అమలు చేయనుందన్నారు. ఇటీవల తుక్కుగూడ సభలో రాహుల్‌గాంధీ ప్రకటించిన ఈ పంచన్యాయాల గ్యారంటీ కార్డులను ప్రతీ గడపకు చేరుస్తామన్నారు. కేంద్రం నుంచి రొటీన్‌గా వచ్చే నిధులు కాకుండా, సొంతంగా తీసుకొచ్చినవేమిటో, పనులేమిటో బీజేపీ అభ్యర్థి, ఎంపీ బండి సంజయ్‌ వెల్లడించాలని డిమాండ్‌ చేశారు. బీఆర్‌ఎస్‌ అభ్యర్థి వినోద్‌కుమార్‌ ఎంపీగా, ప్రణాళికాసంఘం ఉపాధ్యక్షుడిగా పూర్తిగా వి ఫలమయ్యారని విమర్శించారు. కాంగ్రెస్‌ హ యాంలో నగరంలో అండర్‌గ్రౌండ్‌ డ్రైనేజీ నిర్మించడం వల్లే నగరం స్మార్ట్‌సిటీకి అర్హత సాధించిందన్నారు. వీటిని ప్రజలకు వివరిస్తామని, కాంగ్రెస్‌ అభ్యర్థిని గెలిపిస్తామన్నారు. పార్టీలో అంతర్గతంగా చిన్న చిన్న సమస్యలుంటే సర్దుకుపోతా మన్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్‌ బిజీ షెడ్యూ ల్‌ వల్ల, సమాచారలోపంతో తాను కార్యక్రమానికి హాజరుకాలేకపోయానన్నారు. నాయకులు ఎండీ.తాజొద్దీన్‌, శ్రవణ్‌నాయక్‌, బొబ్బిలి విక్టర్‌, సమద్‌ నవాబ్‌, శ్రీనివాస్‌రెడ్డి తదితరులున్నారు.

మీడియా సెంటర్‌ను పరిశీలిస్తున్న
అశ్వినికుమార్‌ పాండే
1/1

మీడియా సెంటర్‌ను పరిశీలిస్తున్న అశ్వినికుమార్‌ పాండే

Advertisement
 
Advertisement
 
Advertisement