వాట్సప్‌లో మరో అదిరిపోయే ఫీచర్‌! | WhatsApp To Introduce View Once Mode For Voice Messages, Know About How It Works - Sakshi
Sakshi News home page

WhatsApp View Once Feature: వాట్సప్‌లో మరో అదిరిపోయే ఫీచర్‌!

Published Fri, Oct 20 2023 11:04 AM

Whatsapp To Introduce View Once Mode For Voice Messages - Sakshi

ప్రముఖ ఇన్‌స్టంట్‌ మెసేజింగ్‌ యాప్‌ వాట్సప్‌ యూజర్‌ ఎక్స్‌పీరియన్స్‌ కోసం కొత్త కొత్త ఫీచర్లను అందుబాటులోకి తెస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల వాట్సప్‌ ఛానెల్స్‌, సింగిల్‌ డివైజ్‌లో మల్టీపుల్ వాట్సప్‌ అకౌంట్లను వినియోగించే మల్టీ- అకౌంట్‌ ఫీచర్‌పై ప్రకటన చేసింది. తాజాగా, ‘వ్యూ వన్స్‌’ తరహాలో వాయిస్‌ నోట్స్‌పై మరో అప్‌డేట్‌తో ముందుకు వచ్చింది. 

వీ బీటా ఇన్ఫో ప్రకారం.. యూజర్ల భద్రత కోసం వాయిస్‌ నోట్స్‌ అనే ఫీచర్‌పై వాట్సప్‌ పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఫీచర్‌ వినియోగంలోకి వస్తే వాయిస్‌ రికార్డ్‌లు ఫోన్‌లలో స్టోరేజ్‌ అవ్వకుండా నిరోధిస్తుంది. 

ఉదాహరణకు ఏ అనే వాట్సప్‌ యూజర్‌ బీ అనే మరో వాట్సప్‌ యూజర్‌కు ఓ ఆడియో ఫైల్స్‌ని పంపిస్తాడు. సాధారణంగా అలాంటి వాయిస్‌ ఫైల్స్‌ ఫోన్‌లలో స్టోరేజ్‌ అవడంతో పాటు అనేక భద్రతా సమస్యలు తలెత్తేవి. అయితే, దీన్ని అధిగమించేలా వాయిస్‌ నోట్స్‌ పేరుతో వాయిస్‌ మెసేజ్‌ ఫీచర్‌ను పరిచయం చేస్తున్నట్లు తెలిపింది. ఈ ఫీచర్‌తో వాట్సప్‌లో పంపిన, లేదంటే రిసీవ్‌ చేసుకున్న ఆడియో ఫైల్స్‌ని ఒక్కసారి ఓపెన్‌ చేస్తే చాలా.. వాటంతట అవే కనుమరుగు కానున్నాయి. \

వ్యూ వన్స్‌ తరహాలో 
మీకు వాట్సప్‌ ‘వ్యూ వన్స్‌’ ఫీచర్‌ గురించి తెలిసిందే. దీని కింద ఎవరైనా పంపిన ఫొటోలు, వీడియోలను ఒకసారి మనం ఓపెన్‌ చేస్తే వాటంతటవే అదృశ్యమైపోతాయి. మళ్లీ కనిపించవు. అదే తరహాలో వాయిస్‌ నోట్స్‌ ఫీచర్‌ రాబోతుంది. 

Advertisement

తప్పక చదవండి

Advertisement