‘అప్పుడే అయిపోలేదు’..ఇంటెల్‌ ఉద్యోగులకు భారీ షాక్‌..! | Sakshi
Sakshi News home page

‘అప్పుడే అయిపోలేదు’..ఇంటెల్‌ ఉద్యోగులకు భారీ షాక్‌..!

Published Wed, Dec 20 2023 6:17 PM

Intel Layoffs 235 Employees - Sakshi

ప్రముఖ టెక్‌ దిగ్గజం ఇంటెల్‌ ఉద్యోగులకు భారీ షాకిచ్చింది. తాజాగా చేపట్టిన 5వ రౌండ్‌ తొలగింపుల్లో సుమారు 235 మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికింది. ఆర్ధిక మాద్యం మందస్తు భయాలు కారణంగా ప్రపంచ వ్యాప్తంగా ఆయా సంస్థలు వర్క్‌ ఫోర్స్‌ను తగ్గించుకుంటున్నాయి. ఇంటెల్‌ సైతం అదే దారిలో ఉన్నట్లు సమాచారం. 

అమెరికా కాలిఫోర్నియాలో శాక్రమెంటో కౌంటీలో రీసెర్చ్‌, డెవలప్‌మెంట్‌ విభాగాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు పింక్‌ స్లిప్‌ జారీ చేసినట్లు తెలుస్తోంది. గత ఏడాది చిప్‌ తయారీ సంస్థ ఇంటెల్‌ 2025 నాటికి కాస్ట్‌ కటింగ్‌ చేసి సుమారు 10 బిలియన్‌ డాలర్లను ఆదా చేయాలనే లక్ష్యాన్ని నిర్ధేశించుకుంది. ఇందులో భాగంగా ఈ నిర్ణయం తీసుకుంది. 

ఈ సందర్భంగా ‘ఇంటెల్ సంస్థ పలు విభాగాల్లో ఉద్యోగుల తొలగింపుతో ఖర్చుల్ని తగ్గించుకునే వ్యూహంతో పనిచేస్తుందని’అని కంపెనీ ప్రతినిధి అడీ బర్ శాన్ ఫ్రాన్సిస్కో క్రానికల్ నివేదికలో పేర్కొన్నారు. ఉద్యోగుల తొలగింపులు అప్పుడే అయిపోలేదని.. వచ్చే ఏడాది మరిన్ని తొలగింపులు ఉండవచ్చని పేర్కొన్నారు. కాగా, గతంలో జరిగిన ఉద్యోగుల తొలగింపుల్లో ఇంటెల్ దాని ఫోల్సమ్ క్యాంపస్‌లో 549 మందికి పింక్‌ స్లిప్‌ జారీ చేసింది.  

Advertisement

తప్పక చదవండి

Advertisement