‘హర్షకుమార్‌.. నాలుక అదుపులో పెట్టుకో’ | Sakshi
Sakshi News home page

‘హర్షకుమార్‌.. నాలుక అదుపులో పెట్టుకో’

Published Fri, Jul 24 2020 12:49 PM

Minister Pinipe Viswarup Firs On Harsha Kumar - Sakshi

సాక్షి, తూర్పుగోదావరి: చంద్రబాబు నాయుడు కాళ్ల మీద పడినప్పుడే హర్ష కుమార్‌ విలువ దిగజారిదంటూ మంత్రి  పినిపే విశ్వరూప్‌ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ‘‘దళితుల పుట్టుక గురించి దారుణంగా మాట్లాడుతున్నారు. నాలుక జాగ్రత్త పెట్టుకో’ అని నిప్పులు చెరిగారు. (దళితులపై చంద్రబాబు కపట ప్రేమ)

‘దళిత పులి అని చెప్పుకునే హర్షకుమార్‌.. ఆయన రాజకీయ భవిషత్తు కోసం ఎంతకైనా జాతిని తాకట్టు పెడతారని విశ్వరూప్‌ దుయ్యబట్టారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్ దళితులకు పెద్దపీట వేశారు. దళితుడు వరప్రసాద్ కేసులో ముఖ్యమంత్రి వెంటనే స్పందించి.. నిందితులను కటకటాల వెనక్కి నెట్టారు. హర్షకుమార్ దిగజారుడు రాజకీయాలు మానుకోవాలి’ మంత్రి విశ్వరూప్‌ హితవు పలికారు. (ఆ కేసు దర్యాప్తులో వేగం పెంచండి: డీజీపీ)

Advertisement
 
Advertisement
 
Advertisement